విజయ్ మిస్టర్ పర్‌పెక్ట్.. క్లీన్ చిట్ ఇచ్చిన ఐటి అధికారులు..

Thalapathy Vijay: మొన్నటికి మొన్న తమిళ హీరో విజయ్ ఇంటిపై జరిగిన ఐటి దాడులు అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. ఎక్కడో నైవేలీలో షూటింగ్ చేస్తున్న విజయ్‌ను ప్రత్యేకంగా అధికారులు వెళ్లి మరీ తీసుకొచ్చారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 13, 2020, 3:10 PM IST
విజయ్ మిస్టర్ పర్‌పెక్ట్.. క్లీన్ చిట్ ఇచ్చిన ఐటి అధికారులు..
దాంతో తెలుగులోనూ విజయ్ మార్కెట్ పెరిగిపోయిందిప్పుడు. తాజాగా ఈయన నటించిన మాస్టర్ సినిమా లాక్‌డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. నిజానికి ఎప్రిల్ 14నే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ లాక్‌డౌన్, కరోనా వైరస్ కారణంగా ఇప్పటికీ రాలేదు.
  • Share this:
మొన్నటికి మొన్న తమిళ హీరో విజయ్ ఇంటిపై జరిగిన ఐటి దాడులు అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. ఎక్కడో నైవేలీలో షూటింగ్ చేస్తున్న విజయ్‌ను ప్రత్యేకంగా అధికారులు వెళ్లి మరీ తీసుకొచ్చారు. రెండు మూడు రోజుల పాటు నాన్ స్టాప్ ఐటి దాడులు జరిపారు. ఈ ఇష్యూ తర్వాత తమిళనాట పొలిటికల్ హీట్ కూడా పెరిగిపోయింది. అది చాలదన్నట్లు నెల రోజుల వ్యవధిలో మరోసారి విజయ్ ఇంటిపై ఐటి దాడులు చేసారు అధికారులు. దాంతో విజయ్‌కు సపోర్టుగా ఇండస్ట్రీలో కొందరు హీరోలు, దర్శకులు కూడా మాట్లాడారు. ఇక విజయ్ కూడా దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. తనపై కావాలనే కుట్ర చేస్తున్నారని అర్థమవుతుందంటూ చెప్పుకొచ్చాడు ఈయన. తాను ఒక ద్రవిడున్ని అని.. ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చిన పార్టీకి తాను తొత్తుగా ఉండలేనని చెప్పాడు విజయ్.

దళపతి విజయ్ (Thalapathy Vijay)
దళపతి విజయ్ (Thalapathy Vijay)


అంతేకాదు అన్నీ సక్రమంగా ట్యాక్సులు కడుతున్న తనపై కావాలనే ఈ రైడ్స్ చేసారనే సంగతి కూడా అర్థమవుతుందని ఆయన సీరియస్‌ అయ్యాడు కూడా. ఇక ఇప్పుడు ఐటి అధికారులు కూడా ఇదే చెప్పారు. విజయ్ దగ్గర ఎలాంటి నల్లడబ్బు లేదని.. ఆయన అన్ని ట్యాక్సులు సక్రమంగానే కట్టాడంటూ క్లీన్ చిట్ ఇచ్చారు. గతేడాది విజయ్ నటించిన 'బిగిల్'.. ఇప్పుడు నటిస్తున్న 'మాస్టర్' సినిమాలకు సంబంధించిన పారితోషికాలపై ఆరా తీశారు. 'బిగిల్' సూపర్ హిట్ కాగా.. ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ సమర్పించిన లెక్కల్లో తప్పులు ఉన్నాయని గుర్తించిన ఐటీ శాఖ అధికారులు.. ఆ శాఖ కార్యాలయాలతో పాటు.. దానికి ఫైనాన్స్ చేసిన అన్బు చెళియన్‌పై కూడా నాన్ స్టాప్ దాడులు చేశారు. మళ్లీ ఇప్పుడు 'మాస్టర్' నిర్మాత లలిత్ కుమార్ ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు.

దళపతి విజయ్ (Thalapathy Vijay)
దళపతి విజయ్ (Thalapathy Vijay)


ఐటి దాడుల కలకలం అంతా పూర్తైన తర్వాత మళ్లీ మాస్టర్ సినిమా షూటింగ్‌కు వెళ్లాడు విజయ్. విజయ్ దగ్గర ఎలాంటి నల్లధనం లేదని ఐటి శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే విజయ్‌పై కావాలనే ఐటి దాడులు చేస్తున్నారని అభిమానులు మండి పడుతున్నారు. అప్పట్లో మాస్టర్ షూటింగ్‌కు BJP నేతలు కొందరు వచ్చి అడ్డుకోవడం.. ఆ వెంటనే తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు సెల్వమణి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ దాడులను ఖండించడం అంతా జరిగిపోయింది. అలా చేయడం వల్ల సినీ కార్మికుల పొట్ట కొట్టడం తప్ప ఇంకేం ఉండదని ఆయన చెప్పాడు. నైవేలీకి వచ్చే ఆదాయం కూడా వాళ్లే పోగొట్టిన వాళ్లు అవుతారంటూ సెల్వమణి కూడా సీరియస్ అయ్యాడు. ఇలాంటి సమయంలో BJPపై విజయ్ ఫ్యాన్స్ కూడా మండి పడుతున్నారు. కావాలనే తమ హీరోను టార్గెట్ చేస్తున్నారంటూ వాళ్లు వాదనకు దిగుతున్నారు.

విజయ్ మాస్టర్ సినిమాలో సాంగ్ (master movie)
విజయ్ మాస్టర్ సినిమాలో సాంగ్ (master movie)


ఇంతమంది హీరోలుండగా ఎందుకు మీరు ప్రతీసారి తమ హీరోనే లక్ష్యంగా చేసుకుని ఇలా చేస్తున్నారంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇక విజయ్ కూడా అభిమానులకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఎవరొచ్చి ఎన్ని బెదిరింపులు చేసినా కూడా నేను మీ వాడినే అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. తను తప్పు చేయలేదని.. చేయనని స్పష్టం చేసాడు. BJPకి భయపడే ప్రసక్తే లేదంటున్నాడు ఈయన. ఈయన ప్రస్తుతం మాస్టర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆయన్ని చూడ్డానికి అక్కడికి వేలాది సంఖ్యలో అభిమానులు వచ్చారు. వాళ్లందర్నీ చూసి విజయ్ కూడా ఆనందంగా ఫీల్ అయ్యాడు.. తనే ఓ సెల్ఫీ తీసుకున్నాడు కూడా. కార్వాన్‌పై ఎక్కి సెల్ఫీ తీసుకున్నాడు విజయ్. ప్రస్తుతం ఈ ఫోటో బాగానే వైరల్ అవుతుంది. మాస్టర్ సినిమాలో విజయ్‌కు విలన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. మొత్తానికి విజయ్ ఐటి దాడుల వ్యవహారం ఇప్పుడు తమిళనాట వైరల్ అవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: March 13, 2020, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading