అలా అయితే ద్వేషించినా పర్లేదు.. జబర్దస్త్ యాంకర్ అనసూయ

అనసూయ ఎప్పుడూ తన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా తన ట్విటర్ హ్యండిల్‌లో ఓ పోస్ట్ చేసింది.

news18-telugu
Updated: June 13, 2019, 6:43 PM IST
అలా అయితే ద్వేషించినా పర్లేదు.. జబర్దస్త్ యాంకర్ అనసూయ
అనసూయ Photo: Twitter.com/anusuyakhasba
news18-telugu
Updated: June 13, 2019, 6:43 PM IST
అనసూయ..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ఆమె తన అందచందాలతో తెలుగువారికి దగ్గరైంది. అయితే ముఖ్యంగా 'జబర్దస్త్' షో ద్వారా మరింతగా పాపులర్ అయ్యింది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్‌లతో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. 'జబర్దస్త్' షోకి కావాల్సినంత గ్లామర్‌నే కాకుండా..తన వ్యాఖ్యానంతో కూడా ప్రేక్షకుల్నీ అలరిస్తూ..షోను మరో ఎత్తుకు తీసుకెళ్తుంది ఈ భామ. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే కాకుండా అప్పుడప్పడూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ సినిమాల్లో కూడా దూసుకుపోతోంది. దాని ఫలితమే 'క్షణం'లో ఆమె చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇరగదీసింది. ఆ తర్వాత అడపా దడపా కొన్ని సినిమాల్లో చేసిన రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం'లో రంగమ్మత్తగా ఎంతగా ఆకట్టకుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పాత్రలో అనసూయ ఒదిగిపోయింది. అనసూయను తప్ప..ఆ పాత్రలో ఇంకోకరిని ఊహించుకోలేము. అంతలా మెప్పించింది. ఈ సినిమాలో తన పాత్రలో అన్ని రకాల భావోద్వేగాలను పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబీనేషన్‌లో వస్తున్న ఆ సినిమాలో ముఖ్యపాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దానికి తోడు ఇపుడీ భామ లీడ్ రోల్‌ చేస్తోన్న ‘కథనం’ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఒకవైపు టీవీ షోస్.. మరోవైపు సినిమాలతో బిజీగా గడుపుతోంది.
Loading...


అది అలా ఉంటే.. అనసూయ ఎప్పుడూ తన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా తన ట్విటర్ హ్యండిల్‌లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో అనసూయ..'మనం మనలా ఉన్నందుకు కొందరూ ద్వేషించిన పర్లేదు కాని..మనం మనం ఉనికిని కోల్పోయి..ప్రేమించబడడం దండగ'  అంటోంది. దీనిపై స్పందిస్తోన్న నెటిజన్స్..వారెవ్వా..సూపర్ సందేశం ఇచ్చారంటూ కొందరు..మాకు తెలుసులే అంటూ మరికొందరు  కామెంట్స్ రాస్తున్నారు.
First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...