ఇస్మార్ట్ శంకర్‌తో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్‌కి ఇస్మార్ట్ హిట్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. చాలా రోజుల తర్వాత వచ్చిన ఈ మూవీ దుమ్మురేపుతోంది. రామ్ ఎనర్జీతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఈ సినిమా ఇప్పటి వరకు 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో తాను చేసి రెండు మంచిపనుల్లో ఒకటి రామ్‌ని కలవడం, రెండోది అతడితో కలసి ఇస్మార్ట్ శంకర్ సినిమా తీయడం అని ప్రకటించాడు. ఛార్మి మాట్లాడుతూ.. రామ్‌ని, పూరీని ఆకాశానికి ఎత్తేసింది. రామ్ యాక్టింగ్, పూరీ టేకింగ్ కలసి సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయని చెప్పింది. రామ్‌కి ఇది రెండో హోమ్ బ్యానర్ లాంటిదని చెప్పింది.
సినిమా చూశాక తాను ఎలా ఫీల్ అయ్యానో.. ఆడియన్స్ రియాక్షన్ చూశాక తాను అలా ఫీల్ అయ్యానని రామ్ చెప్పాడు. మంచి క్యారెక్టర్ ఇచ్చి డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసిన పూరీకి థాంక్స్ చెప్పాడు. తన విజయం కోసం ఆకాంక్షించిన అందరికీ ఇస్మార్ట్ శంకర్ సినిమాని అంకితం ఇచ్చాడు రామ్.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.