ఇస్మార్ట్ శంకర్ హీరోగా.. RX 100 డైరెక్టర్‌ కొత్త సినిమా..

Ram Pothineni : ‘ఇస్మార్ట్ శంకర్’తో తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ అందుకున్నాడు. దీంతో ఊపు మీదున్న రామ్ మరో కొత్త సినిమాకు ప్లాన్ చేశాడు.

news18-telugu
Updated: September 15, 2019, 10:53 AM IST
ఇస్మార్ట్ శంకర్ హీరోగా.. RX 100 డైరెక్టర్‌ కొత్త సినిమా..
Instagram/ram_pothineni
  • Share this:
Ram Pothineni : పూరి ‘ఇస్మార్ట్ శంకర్’తో తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ అందుకున్నాడు రామ్. ‘ఇస్మార్ట్ శంకర్’‌ పూర్తిగా మాస్ ఎంటర్ టేనర్‌గా పూరీ మార్క్‌ హీరోయిజంతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో రామ్‌ హైదరాబాదీ పోరడి పాత్రలో ఇస్మార్ట్ శంకర్ పాత్రలో ఒదిగిపోయాడు. పూర్తిగా హైద‌రాబాద్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రామ్ డైలాగులు కూడా మాస్‌ను కిక్కేంచేలా ఉండి రెండు తెలుగు రాష్ట్రాల్లో యువతను ఉర్రూతలూగించాయి. దీంతో కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. ఆ సినిమా రామ్ కెరీర్‌లో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. అంత పెద్ద హిట్ తర్వాత మరే సినిమా చేయాలన్న కొంత బెణుకు భయం ఉంటాయి. నెక్ట్స్ సినిమా ఎలా ఉండబోతుందో.. ఎలా ఎవరితో కుదురుతుందో అని.. కానీ అవన్ని పక్కన పెట్టి..  ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నచ్చిన కథలు రావడంతో.. వరుసగా సినిమాల్నీ ఓకే చేస్తూ.. మరో కొత్త సినిమాకు రెడీ అయ్యాడు.
 View this post on Instagram
 

Mildly Wild / Wildly Mild? #RAPO


A post shared by RAm POthineni (@ram_pothineni) on

రామ్ ‘ఆర్‌ఎక్స్‌ 100’తో తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్న.. అజయ్‌ భూపతితో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రామ్, అజయ్ భూపతి కాంబినేషన్‌లో భవ్య క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించడానికి రంగం సిద్ధం చేసింది. ఆనంద ప్రసాద్‌ నిర్మాత. ప్రస్తుతం స్టోరి డిస్కషన్స్ జరుగుతున్నాయని, కథ ఫైనల్ అయ్యాక మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది. కాగా రామ్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో 'ఉన్నది ఒక్కటే జిందగీ'  డైరెక్టర్ కిషోర్‌ తిరుమలతో ఈ సినిమాను చేస్తున్నట్లు సమాచారం. రామ్ ఇంతకు ముందు కిషోర్ తిరుమలతో ‘నేను శైలజ’, అనే సినిమాను కూడా చేశాడు. ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించిన ‘తడమ్‌’కి రీమేక్‌గా వస్తోంది. కాగా ఈ సినిమాకు సంబందించిన మిగితా నటీ నటులు, టెక్నికల్ టీమ్ గురించి పూర్తి వివరాల్నీ చిత్ర బృందం త్వరలో వెల్లడించనుంది.

Published by: Suresh Rachamalla
First published: September 15, 2019, 8:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading