డబుల్ ధిమాక్ ‘ఇస్మార్ట్ శంకర్’ డబుల్ ధమాకా..

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే సాధించింది. తాజాగా రామ్ పోతినేని మరో సినిమాకు సైన్ చేసాడు. ఈ సినిమాలో డబుల్ ధిమాక్ తరహాలో..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 19, 2019, 7:37 PM IST
డబుల్ ధిమాక్ ‘ఇస్మార్ట్ శంకర్’ డబుల్ ధమాకా..
రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ Instagram/ram_pothineni
  • Share this:
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే సాధించింది. ఈ సినిమ ా సక్సెస్‌తో రామ్ ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. ఈ ఊపులోనే తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా సూపర్ హిట్టైన ‘తడమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాను రామ్ సొంత ప్రొడక్షన్స్‌లో స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నాడు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ‘తడమ్’లో అరుణ్ విజయ్ డబుల్ రోల్లో యాక్ట్ చేసాడు. ఈ సినిమ రీమేక్‌లో రామ్ ఫస్ట్ టైమ్ డబుల్‌ రోల్లో యాక్ట్ చేయనున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ డబుల్ దిమాక్ పాత్రలో మెప్పించిన రామ్ పోతినేని... ఇపుడు చేయబోతున్న ‘తడమ్’ రీమేక్‌లో డబుల్ రోల్లో రామ్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు