అభిమానులకు ఇస్మార్ట్ శంకర్ రిక్వెస్ట్.. ఈ సారి అలా వద్దు అంటూ రామ్ విజ్ఞప్తి..

గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ హీరోగా తన పవరేంటో చూపించాడు. తాజాగా ఈయన తన అభిమానులను ఉద్దేశిస్తూ.. ఓ లేఖ విడుదల చేసాడు.

news18-telugu
Updated: May 12, 2020, 6:26 PM IST
అభిమానులకు ఇస్మార్ట్ శంకర్ రిక్వెస్ట్.. ఈ సారి అలా వద్దు అంటూ రామ్ విజ్ఞప్తి..
రామ్ పోతినేని
  • Share this:
గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ హీరోగా తన పవరేంటో చూపించాడు. ఈ సినిమాపెట్టిన పెట్డుబడికి మూడింతల లాభాల్ని తీసుకొచ్చింది. గతేడాది విడుదలై ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన చిత్రాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ ముందు వరుసలో ఉంది. చాలా రోజుల తర్వాత మాస్ ఆడియన్స్‌ని ఈ చిత్రం డాన్సులు చేయించింది. చాలా రోజుల తర్వాత థియేటర్లలో విజిల్స్, గోలలు చేస్తూ ఎంజాయ్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ కెరీర్‌లో కూడా తొలిసారి రూ.40 కోట్ల షేర్‌ అందుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఎన్టీఆర్‌తో చేసిన టెంపర్ తర్వాత  సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌కు ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా అంతే. చాలా ఏళ్ళ తర్వాత అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ను రాబట్టింది.ఇక మే 15న రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ పోతినేని తన అభిమానులు ఎవరు తన బర్త్ డే వేడుకలు చేయోద్దంటూ రిక్వెస్ట్ చేసాడు.


ప్రస్తుతం మన దేశం కరోనా అనే మహామ్మారితో పోరాడుతోంది. ఈ సమయంలో అందరు ఇంట్లోనే ఉంటూ కరోనానను తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చాడు. ప్రస్తుతం రామ్ .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ రెడ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ తొలిసారి ద్విపాత్రిభినయం చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
First published: May 12, 2020, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading