ఇస్మార్ట్ పోరిని మెచ్చుకున్న బాలయ్య..

Nabha Natesh : నభా నటేష్‌.. తెలుగులో సూపర్ క్రేజ్‌ ఉన్న హిరోయిన్. పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో చాందిని పాత్రలో అదిరిపోయే నటనతో పాటు అందచందాలతో అదరగొట్టింది.

news18-telugu
Updated: October 17, 2019, 9:05 AM IST
ఇస్మార్ట్ పోరిని మెచ్చుకున్న బాలయ్య..
Instagram/nabhanatesh
  • Share this:
నభా నటేష్‌.. తెలుగులో సూపర్ క్రేజ్‌ ఉన్న హిరోయిన్. పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో చాందిని పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ స్పీడ్‌కు ఎక్కడా  తగ్గకుండా అదిరిపోయే నటనతో పాటు అందచందాలతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది. ఆ సినిమా  బ్లాక్‌ బస్టర్‌ అవ్వడంతో ఈ  బెంగళూరు భామ నభా నటేష్‌ కెరీయర్‌ టాప్‌గేర్‌కి పడింది. అందులో భాగంగా ఈ భామ రెడ్ కలర్ మెర్సిడస్ బెంజ్ కారు కొని.. దానితో దిగిన ఫోటోల్నీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటోస్ హల్ చల్ చేస్తున్నాయి.

Instagram/nabhanatesh


అది అలా ఉంటే నభా తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుతోంది. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో నభా  1 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌న దాటింది. దీంతో సూపర్ హ్యాపిగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఓ ఫోటోను తన స్టోరీస్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలో నభా నటేష్ ఈ మధ్య కొన్న కారుపై బాలయ్య స్టైలీష్‌గా కుర్చోని ఉన్నాడు. మిలియన్ మార్క్‌ను దాటినందుకు బాలయ్య తనకు అభినందనలు తెలుపుతున్నట్లుగా ఓ ఫోటోను షేర్ చేసింది. అంతేకాదు ఆ ఫోటోపై నభా.. జై బాలయ్య అంటూ రాసుకొని తన అభిమానాన్ని చాటుకుంది.  అది అలా ఉంటే నభా ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌తో 'సోలో బతుకే సో బెటర్‌' రవితేజతో 'డిస్కో రాజా' చిత్రాలతో బిజీగా ఉంది.


Published by: Suresh Rachamalla
First published: October 17, 2019, 8:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading