news18-telugu
Updated: January 18, 2020, 3:32 PM IST
Twitter
నభా నటేష్.. తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. నభా.. పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'లో చాందిని పాత్రలో నటించి అదరగొట్టింది. ఈ సినిమాలో రామ్ స్పీడ్‌కు ఎక్కడా తగ్గకుండా అదిరిపోయే నటనతో పాటు అందచందాలతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. అది అలా ఉంటే టాలీవుడ్లో హీరోయిన్స్‌కు ఇచ్చినంత రెమ్యూనరేషన్ దాదాపు ఏ ఇండస్ట్రీలో ఇవ్వరని టాక్. అందువలన తెలుగు సినిమాలు చేయడానికే హీరోయిన్స్ ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు. అందులో భాగంగా కన్నడ సినిమాల్లో తక్కువ పారితోషికమే తీసుకుంటున్న నభా నటేశ్, తెలుగులో తన పారితోషికాన్ని ఆమాంతం పెంచారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ ముద్దుగుమ్మ 'ఇస్మార్ట్ శంకర్' కోసం దక్కిన పారితోషికం కేవలం 20 లక్షలు. ఆ సినిమా హిట్ కావడంతో ఈ అమ్మడు తన పారితోషికాన్ని 40 లక్షలు చేసేసింది. అదే పారితోషికాన్ని ఆమె 'డిస్కోరాజా' కోసం అందుకుంది. ఆ తరువాత మరో సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేస్తోంది. ఈ సినిమాకిగాను నభా 80 లక్షలను డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అడిగిన అంత మొత్తాన్ని కూడా నిర్మాతలు ఇవ్వడానికి అంగీకరించారట. మరో సినిమా హిట్ అయితే.. నభా త్వరలోనే కోటి రూపాయలకి పైగా పారితోషికాన్ని అందుకునే హీరోయిన్స్ల జాబితాలో చేరడానికి ఎంతో కాలం పట్టదు.
కేకపెట్టిస్తోన్న బిగ్‌బాస్ భామ అందాలు..
Published by:
Suresh Rachamalla
First published:
January 18, 2020, 3:31 PM IST