ఎవరైనా తాము తీసిన సినిమాను బాగుందనే చెప్పుకుంటారు. కానీ విడుదలకు వారం రోజుల ముందే స్పెషల్ షో వేసుకుని అది సూపర్ హిట్.. బంపర్ హిట్ అని చెప్పడానికి కాస్త భయపడుతుంటారు. కానీ ఇప్పుడు రామ్ అండ్ గ్యాంగ్ మాత్రం ఇదే చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా జులై 18న విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు దర్శక నిర్మాతలు. జులై 11నే తమ కోసం ప్రత్యేకంగా షో వేసుకుని చూసిన తర్వాత ట్విట్టర్ ప్రమోషన్ మొదలుపెట్టారు.
ఇక హీరో రామ్ అయితే సినిమా చూసిన కిక్కులో ట్వీట్ చేసాడు. దీనమ్మ జీవితం.. ఏం కిక్కు రా బాబూ ఇది అంటూ రెచ్చిపోయాడు. ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ సినిమాలు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం మరోలా ఉంటుంది చూసుకోండి అంటున్నాడు ఈయన. చివర్లో అయితే ఏకంగా పూరీని డ్రగ్‌తో పోల్చేసాడు.

ఇస్మార్ట్ శంకర్ స్పెషల్ షో
సినిమా చూసిన తర్వాత మీకు కూడా అంతే కిక్ వస్తుందంటున్నాడు రామ్. ఇక పూరీ జగన్నాథ్ కూడా తన కెరీర్లో అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ డ్రగ్ అంటున్నాడు. మొత్తానికి వీళ్లు చెప్తున్న రేంజ్ ఇస్మార్ట్ శంకర్‌లో ఉందో లేదో చూడాలి. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఛార్మి, పూరీ సొంత బ్యానర్లో సినిమా నిర్మించారు.
Published by:Praveen Kumar Vadla
First published:July 12, 2019, 07:23 IST