యూట్యూబ్‌లో దిమాక్ ఖరాబ్ రచ్చ రచ్చ.. ఇస్మార్ట్ శంకర్ పాట సరికొత్త రికార్డు..

నిధి అగర్వాల్, నభా నటాషా అందాల ఆరబోతతో దిమాక్ ఖరాబ్ పాట మాస్‌కు పిచ్చెక్కించింది. విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపుతోంది.

news18-telugu
Updated: September 23, 2019, 4:13 PM IST
యూట్యూబ్‌లో దిమాక్ ఖరాబ్ రచ్చ రచ్చ.. ఇస్మార్ట్ శంకర్ పాట సరికొత్త రికార్డు..
దిమాక్ ఖరాబ్ సాంగ్
  • Share this:
పూరీ జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. మాస్ ఆడియన్స్‌ని ఈ చిత్రం డాన్సులు చేయించింది. చాలా రోజుల తర్వాత థియేటర్లలో విజిల్స్, గోలలు చేస్తూ ఎంజాయ్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ కెరీర్‌లో కూడా తొలిసారి 40 కోట్ల షేర్‌కు చేరువగా వచ్చిన సినిమా ఇది. 11 ఏళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేని పూరీకి ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా అంతే. చాలా ఏళ్ళ తర్వాత అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కాగా.. తాజాగా ఈ సినిమా నుంచి దిమాక్ ఖరాబ్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నిధి అగర్వాల్, నభా నటాషా అందాల ఆరబోతతో ఈ పాట మాస్‌కు పిచ్చెక్కించింది. విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపుతోంది.

అయితే, ఈ వీడియో సాంగ్ రిలీజైనప్పటి నుంచి ఇప్పటి వరకు కోటి వ్యూస్‌ను దక్కించుకుంది. కేవలం మూడు రోజుల్లోనే కోటి వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించడంతో చిత్ర బృందం ఉబ్బితబ్బిబ్బవుతోంది.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>