టెంపర్ తర్వాత సరైన విజయం కోసం చూస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇక ఇప్పుడు ఈయన తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైంది. దీనిపై ముందు నుంచి కూడా భారీ అంచనాలున్నాయి. తొలి ట్రైలర్ విడుదలైనపుడు పెద్దగా ఆసక్తి చూపించలేదు కానీ రెండో ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఇస్మార్ట్ శంకర్. ప్రీమియర్ షోస్ కూడా మొదలైపోయాయి. యుఎస్ టాక్ బట్టి చూస్తుంటే ఈ సారి పూరీ కాస్త కొత్తగా ట్రై చేసాడని అర్థమవుతుంది. అయితే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

ఇస్మార్ట్ శంకర్ ఫైల్ ఫోటో
పూరీ గత సినిమాలతో పోలిస్తే ఇస్మార్ట్ శంకర్ నయమే అంటున్నారు ప్రేక్షకులు. రామ్ కూడా తెలంగాణ యాసలో కుమ్మేసాడు. ఆయన నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఇక నిధి అగర్వాల్, నభా నటేష్ అయితే ఏ మాత్రం సంకోచించకుండా అందాలు ఆరబోసారు. పూరీ మార్క్ స్క్రీన్ ప్లే.. తెలంగాణ మాటలు.. గ్లామర్ షో అన్నీ కలిపి ఇస్మార్ట్ శంకర్‌ను ఇస్మార్ట్ సినిమాగా మార్చేస్తున్నాయి. టాక్ ప్రకారం మాస్ సెంటర్లలో ఇస్మార్ట్ శంకర్ దుమ్ము దులిపేయడం ఖాయం అంటున్నారు. పూర్తి టాక్ బయటికి వస్తే కానీ పూరీ జగన్నాథ్ ఈ సారైనా హిట్ కొట్టాడా లేదా అనేది తెలుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:July 18, 2019, 07:02 IST