‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్.. అసలు హీరోగా సరైన సక్సెస్‌లేని రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమ ా చేసాడు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం అదిరిపోతున్నాయి. గత కొన్నెేళ్లుగా మార్కెట్లో మాస్ సినిమా కోసం వెయిట్ చేస్తోన్న ప్రేక్షకులకు ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో మంచి సినిమా దొరకడంతో కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తున్నారు. తొలిరోజు ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ చూసి ఇప్పుడు అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటి వరకు రామ్ కెరీర్లో కూడా ఎప్పుడూ ఈ స్థాయి వసూళ్లు రాలేదు. ఫస్ట్ డే ఇటు తెలంగాణ.. అటు ఆంధ్రాలో చిన్నసైజ్ విధ్వంసాన్ని సృష్టించాడు ఇస్మార్ట్ శంకర్. రెండు రాష్ట్రాల్లో కలిపి ఫస్ట్ డే రూ.7.83 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా.. ఓవర్సీస్తో కలుపుకొని రూ.14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్.

ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ ఊచకోత
తాజాగా రెండో రోజు కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర దూకుడు తగ్గలేదు. రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రల్లో కలిపి 4.29 కోట్ల షేర్ వసూళు చేసింది. మొత్తంగా రెండు రోజులకు గాను రూ. 11.75 కోట్ల షేర్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర మాస్ సినిమా సత్తా ఏమిటో చూపించింది. మొత్తంగా రెండు రోజులకు గాను ఓవరాల్‌గా రూ. 25 గ్రాస్ వసూలు చేసింది. అన్ని ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ వీకెండ్ నాటికీ లాభాల్లో వచ్చే అవకాశం ఉంది.పూరీ మార్క్ మాస్ డైలాగులతో ఈ సినిమా నిండిపోయింది. దానికి తోడు రామ్ యాక్టింగ్.. హీరోయిన్లు నిధి, నభా నటేష్ గ్లామర్ షో అదనపు ఆకర్షణ.

ఇస్మార్ట్ శంకర్
మొత్తంగా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు మూడు రోజుల్లోనే దాన్ని క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరో సినిమా కూడా ఏదీ బాక్సాఫీస్ దగ్గర లేకపోవడం ఇస్మార్ట్ శంకర్‌కు కలిసొచ్చే అంశం. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర పూరీ జగన్నాథ్, రామ్‌ల దండయాత్ర ఏ మేరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:July 20, 2019, 13:39 IST