‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హీరోగా రామ్‌కు, దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు కొత్త ఊపిరి పోసింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న వీళ్లిద్దరు ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ నటన మాస్ ప్రేక్షకులను మెప్పించింది. మరోవైపు దర్శకుడిగా తన పని అయిపోయిందన్న వాళ్లకు ఈ సినిమాతో సమాధానమిచ్చాడు. ఈ సినిమా వీళ్లిద్దరికే కాదు.. హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభా నటేష్‌కు లైఫ్ ఇచ్చింది. వీళ్లిద్దరు కూడా తొలిసారి సక్సెస్ రుచి చూసింది కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతోనే. ఈ సినిమా తర్వాత హీరోయిన్స్‌గా వీళ్లిద్దరి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమాలో వీళ్లిద్దరు మరోసారి తెరపై కనిపించనున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాలో కియారా అద్వానీని అనుకున్నారు. ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ చిత్రానికి డేట్స్ కేటాయించలేపోయింది. ఇపుడు కియారా ప్లేస్‌లో హీరోయిన్గా నిధి అగర్వాల్‌ను తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు మరో ముఖ్యపాత్ర కోసం నభా నటేష్‌ను సంప్రదించినట్టు సమాచారం.

ఇస్మార్ట్ భామలతో వరుణ్ తేజ్ (Twitter/Photo)
అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను అల్లు వెంకటేష్, సిద్దు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:November 27, 2019, 13:20 IST