హోమ్ /వార్తలు /సినిమా /

ఇస్మార్ట్ బ్యూటీ ఇస్మార్ట్ ప్లాన్... లేటెస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా...

ఇస్మార్ట్ బ్యూటీ ఇస్మార్ట్ ప్లాన్... లేటెస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా...

నిధి అగర్వాల్(ఫైల్ ఫోటో)

నిధి అగర్వాల్(ఫైల్ ఫోటో)

అప్ కమింగ్ హీరోలు, కొత్త హీరోల సరసన నటించే విషయంలోనూ ముద్దుగుమ్మ చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. ఇస్మార్ట్ శంకర్‌ మూవీతో పాపులరైన నిధి అగర్వాల్ కూడా ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది.

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. స్టార్ హీరోయిన్ అయిన తరువాత ఒక్కో సినిమాకు ఒక్కోలా పారితోషికం అందుకునే ముద్దుగుమ్మలు... ఈ విషయంలో రకరకాల స్ట్రాటజీలను ఫాలో అవుతుంటారు. స్టార్ హీరో సినిమాకు ఓ రేటు, స్టార్ డైరెక్టర్ సినిమాకు ఓ రేటు ఫిక్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే అప్ కమింగ్ హీరోలు, కొత్త హీరోల సరసన నటించే విషయంలోనూ ముద్దుగుమ్మ చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. అలాంటి సినిమాలో నటించేందుకు భారీగా పారితోషికం డిమాండ్ చేస్తుంటారు. లేటెస్ట్‌గా ఇస్మార్ట్ శంకర్‌ మూవీతో పాపులరైన నిధి అగర్వాల్ కూడా ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది.

త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా పరిచయం అవుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించబోతోంది నిధి. అయితే ఈ సినిమాలో నటించినందుకుగానూ కోటి 25 లక్షల రెమ్యూనరేషన్ అందుకుంటుందీ ఈ హాట్ బ్యూటీ. ఇస్మార్ట్ శంకర్ మూవీతో నిధి అగర్వాల్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే మేకర్స్ కూడా ఆమె పారితోషికం విషయంలో అస్సలు ఆలోచించకుండా ఓకే చెప్పేశారని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

First published:

Tags: Ismart Shankar, Mahesh Babu, Nidhi agarwal

ఉత్తమ కథలు