పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత ఏకధాటిగా సినిమాలను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలాగే వరుస సినిమాలను పూర్తి చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పటికే వకీల్‌సాబ్ సినిమాను పూర్తి చేసిన పవన్ ఇప్పుడు రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లారు. అందులో ఒకటి డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేస్తుండగా మరో సినిమా మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్ సినిమాకు రీమేక్. ఈ రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు పవన్‌కల్యాణ్. ఈ రెండు సినిమాల్లో జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా పీరియాడికల్ మూవీ అనే సంగతి తెలిసిందే.
ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఒకరేమో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్. కాగా, మరో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలంటూ చిత్ర యూనిట్ పెద్ద కసరత్తే చేసింది. ఈ లిస్టులో చాలా మంది హీరోయిన్స్ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కాగా.. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఇందులో నిధి అగర్వాల్ రెండో హీరోయిన్గా నటిస్తుందట. ఆమె షూటింగ్లో కూడా పాల్గొందని టాక్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరో మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న నిధి అగర్వాల్‌కు పవన్‌కల్యాణ్ సినిమాలో నటించే అవకాశం రావడం కలిసొచ్చే అంశమే. మరి నిధి పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుందనే సంగతి తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
Ismart shankar heroine Nidhhi Agerwal in Pawan Kalyan and Krish Movie
ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ బందిపోటు పాత్రలో కనిపిస్తాడు. కెరీర్లో పవన్ చేస్తున్న తొలి పీరియాడికల్ మూవీ. మరి ఫ్యాన్స్‌ను ఎలా మెప్పించనుందో చూడాలి మరి. దీని తర్వాత పవన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయిపోతాడు మరి. మరోవైపు క్రిష్, పవన్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.