టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 చివరిదశకు రానుంది. మరో వారం రోజుల్లో ఈ షో పూర్తికానుంది. మొన్న ఆదివారం శివజ్యోతి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఇంకా ఐదుగురు సభ్యులే మిగిలారు. బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్, శ్రీముఖి, రాహుల్ ఉన్నారు. ఈ ఐదుగురిలో ఎవరో విన్నర్ అవుతారనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
షో చివరి దశకు వచ్చేయడంతో ఫైనల్ కోసం ఇటు యాజమాన్యం కూడా భారీగా ప్లాన్ చేస్తుంది.
అయితే ఫైనల్ లో విజేతను ప్రకటించడానికి నాగార్జున చిరంజీవిని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. దీనికి ఆయన కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక ఫైనల్ లో టీఆర్పీ రేటింగ్స్ కోసం రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహించాలని స్టార్ మా యాజమాన్యం భావిస్తోంది. ఈ మేరకు ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ఫైనల్ లో 5 నిముషాలు కుర్రకారుకు ఊపు తెప్పించనున్నారు. దీనికి అందాల నిధి కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ మూడు సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ మరింత హైలైట్ కానుందని బిగ్ బాస్ ప్రేక్షకులతో పాటు.. నిర్వాహకులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss, Bigg Boss 3, Bigg Boss 3 Telugu, Bigg boss telugu 3, Ismart Shankar, Ismart Shankar Movie Review, Nidhhi Agerwal