గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. పక్కా హైదరాబాదీ పోరడిగా రామ్ చేసిన రచ్చ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ‘ఇస్మార్ట్ శంకర్’ గా రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమ ా సక్సెస్‌తో రామ్ ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. రీసెంట్గా ఈ సినిమా 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఈ ఊపులోనే తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా సూపర్ హిట్టైన ‘తడమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.తాజాగా ఈ సినిమాను ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. ‘రెడ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ లుక్ డిఫరెంట్‌గా ఉంది. లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. హీరోగా రామ్‌కు ఇది 18వ సినిమా.
‘రెడ్’ సినిమాను రామ్ సొంత ప్రొడక్షన్స్‌లో వాళ్ల పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నాడు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయనున్నాడు.‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సంగీతం అందించిన మణిశర్మ ఈ సినిమాకు పనిచేయనున్నారు. తమిళంలో ‘తడమ్’విషయానికొస్తే.. ఈ సినిమాలో అరుణ్ విజయ్ డబుల్ రోల్లో యాక్ట్ చేసాడు‘రెడ్’ సినిమా రీమేక్‌లో రామ్ ఫస్ట్ టైమ్ డబుల్ రోల్లో యాక్ట్ చేయనున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ డబుల్ దిమాక్ పాత్రలో మెప్పించిన రామ్ పోతినేని... ఇపుడు చేయబోతున్న ‘తడమ్’ రీమేక్ ‘రెడ్’ సినిమాలో రామ్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ismart Shankar, Kishore Tirumala, Mani Sharma, Ram Pothineni, RED Movie, Telugu Cinema, Tollywood