పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే సాధించింది. ఈ సినిమ ా సక్సెస్‌తో రామ్ ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. రీసెంట్గా ఈ సినిమా 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఈ ఊపులోనే తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా సూపర్ హిట్టైన ‘తడమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.తాజాగా ఈ సినిమాను ఫస్ట్ లుక్‌ను రేపు సాయంత్రం 4.30 నిమిషాలకు ఫస్ట్ లుక్‌తో పాటు సినిమా టైటిల్‌ను రివీల్ చేయనున్నట్టు ప్రకటించాడు.హీరోగా రామ్‌కు ఇది18వ సినిమా.
💥DEEPAVALI SURPRISE!💥 #RAPO18 is Officially ON!! #KishoreTirumala #Manisharma @SravanthiMovies
— RAm POthineni (@ramsayz) October 27, 2019
Wish you all a #HappyDeepavali !!
Love..#RAPO pic.twitter.com/nezs4o8vhz
ఈ సినిమాను రామ్ సొంత ప్రొడక్షన్స్‌లో వాళ్ల పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నాడు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయనున్నాడు.‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సంగీతం అందించిన మణిశర్మ ఈ సినిమాకు పనిచేయనున్నారు. తమిళంలో ‘తడమ్’విషయానికొస్తే.. ఈ సినిమాలో అరుణ్ విజయ్ డబుల్ రోల్లో యాక్ట్ చేసాడు. ఈ సినిమ రీమేక్‌లో రామ్ ఫస్ట్ టైమ్ డబుల్ రోల్లో యాక్ట్ చేయనున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ డబుల్ దిమాక్ పాత్రలో మెప్పించిన రామ్ పోతినేని... ఇపుడు చేయబోతున్న ‘తడమ్’ రీమేక్‌లో డబుల్ రోల్లో రామ్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ismart Shankar, Kishore Tirumala, Puri Jagannadh, Ram Pothineni, Telugu Cinema, Tollywood