గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఈ సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాథ్.. హీరో రామ్‌ను కొత్తగా చూపించాడు. అంతేకాదు ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ తప్పించి మరో నటుడు ఈ క్యారెక్టర్‌లో ఊహించుకోలేనంత రేంజ్‌లో తన నటనతో ఇరగదీసాడు. ఈ సినిమా తర్వాత రామ్.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమా చేసాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తైయిన ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల కాకుండా ఆగిపోయింది. ముందుగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ వినబడినా.. థియేటర్స్‌లో రిలీజైన తర్వాత కానీ.. ఓటీటీలో విడుదల చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రంలో రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని.. దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు.
చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి ‘కిక్’ ‘రేసు గుర్రం’ తరహాలో ఒక వెరైటీ యాక్షన్ డ్రామాను రామ్ కోసం రెడీ చేసాడట. ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పి రామ్‌తో ఓకే అనిపించుకున్నాడట సురేందర్ రెడ్డి. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌తో రామ్‌ను కలవనున్నాడు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను డైరెక్ట్ చేసినా.. అందులో దర్శకుడిగా సురేందర్ రెడ్డికి అంతగా పేరు మాత్రం రాలేదు. క్రెడిట్ మొత్తం చిరంజీవికే పోయింది. పైగా తెలుగులో తప్పించి మిగిలిన భాషల్లో ఈ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. అందుకే సురేందర్ రెడ్డి తనదైన శైలిలో ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకోని రామ్‌తో నెక్ట్స్ మూవీ చేసి మరోసారి దర్శకుడిగా సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం హీరో రామ్.. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. దీంతో వీళ్లిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అపుడే అంచనాలు మొదలయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Pothineni, RED Movie, Surender reddy, Tollywood