‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ‘రెడ్’ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన రామ్..

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత రామ్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. అంతేకాదు కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు.

news18-telugu
Updated: October 30, 2019, 11:45 AM IST
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ‘రెడ్’ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన రామ్..
రామ్ ‘రెడ్’ సినిమా ప్రారంభోత్సవం (twitter/Photo)
  • Share this:
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత రామ్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ ఓన్ ప్రొడక్షన్స్ స్రవంతి మూవీస్ బ్యానర్‌లో పెదనాన్న స్రవంతి కిషోర్ నిర్మాణంలో ‘రెడ్’ సినిమాకు ఈ రోజు కొబ్బరికాయ కొట్టాడు. ఈ సినిమాకు ముహూర్తం షాట్‌కు తనకు ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సూపర్ సక్సెస్ అందించిన పూరీ జగన్నాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. పూరీతో పాటు ఛార్మి కూడా హాజరైంది.ఇక పూరీ, రామ్  కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా రీసెంట్‌గా 100 రోజులు కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే డిఫరెంట్ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు.

ismart shankar fame ram pothineni new movie started with director kishore tirumala title as red,Ram Pothineni,red,ram pothineni new movie opening,ram kishore tirumala movie,ram red movie,red movie,ram pothineni red movie,red first look,Ram Pothineni twitter,Ram Pothineni insmart shankar,ismart shankar 100 days,100 days ismart shankar,diwali 2019,ram 18th movie,ram puri jagannadh ismart shankar 100 days,ram pothineni play double role,ram play double dimag,ram pothineni play doble role in his next movie,ram puri jagannadh,ram kishore tirumala,Nidhhi Agerwal ismart shankar,Nabha Natesh ismart shankar,Dimaak Kharaab Full Video Song,ismart shankar Dimaak Kharaab Full Video Song,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,దిమాక్ ఖరాబ్ ఇస్మార్ట్ శంకర్,తెలుగు సినిమా,రామ్ పోతినేని నిధి అగర్వాల్ నభా నటేష్,దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ ఇస్మార్ట్ శంకర్,రామ్ డబుల్ రోల్,రామ్ డబుల్ యాక్షన్,రామ్ ద్విపాత్రాభినయం,రామ్ రెండు పాత్రలు,రామ్ ఫస్ట్ లుక్,రెడ్ సినిమా,రామ్ రెడ్ మూవీ ఫస్ట్ లుక్,రెడ్ మూవీతో వస్తోన్న రామ్,రామ్ రెడ్ మూవీ ఓపెనింగ్,రెడ్ మూవీకి కొబ్బరికాయ కొట్టిన రామ్
‘రెడ్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న రామ్ కొత్త సినిమా (twitter/photo)


గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘నేను శైలజా’ మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న కమర్షియల్‌గా ఆడలేదు. ‘రెడ్’ సినిమా తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా నటించగా సూపర్ హిట్టైన ‘తడమ్’ సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు. ఇప్పటికే ‘రెడ్’ అనే టైటిల్‌తో విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోగా రామ్‌కు ఇది 18వ సినిమా. ఈ సినిమాలో రామ్ మొదటిసారి ద్విపాత్రాభియం చేస్తున్నట్టు సమాచారం. మరి ‘రెడ్’ చిత్రంతో రామ్ మరో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

First published: October 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...