కొందరు హీరోయిన్లకు తొలి సినిమా కలిసి రాదు కానీ తర్వాతి సినిమాలు మాత్రం బాగానే కలిసొస్తాయి. ఇప్పుడు నభా నటేష్‌ను చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. నన్ను దోచుకుందువటే అంటూ వచ్చినా కూడా ప్రేక్షకుల మనసు దోచుకోలేకపోయింది ఈ భామ. కానీ ఆ తర్వాత వచ్చిన పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది ఈ బ్యూటీ. ఈ చిత్రంలో అందంతో పాటు అభినయంలోనూ మంచి మార్కులే వేయించుకుంది నభా. దాంతో ఇఫ్పుడు ఈమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కోరాజా చిత్రంలో మెయిన్ హీరోయిన్గా నటిస్తుంది నభా.
ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇది సెట్స్‌పై ఉండగానే ఇప్పుడు మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెట్టబోతుంది నభా నటేష్. అక్కడ సాయి ధరమ్ తేజ్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది నభా. కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న సోలో బ్రతుకే సో బెటరూ సినిమాలో సాయికి జోడీగా నటిస్తుంది నభా. తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. సాయి కూడా షూటింగ్లో అడుగు పెట్టాడు. మొత్తానికి ఈ చిత్రం కానీ హిట్ అయిందంటే నభా నటేష్ సెకండ్ గ్రేడ్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ అయిపోతుందేమో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ismart Shankar, Nabha Natesh, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood