సినిమాల్లో డమ్మీ గన్లతో విలన్లపై దండయాత్ర చేసే హీరోకు నిజమైన గన్ చేతికి వస్తే ఎలా ఉంటుంది. తాజాగా అలాంటి ఘటన ఇస్మార్ట్ హీరో రామ్‌కు దక్కింది. దేశంలోని రక్షణ దళాలు, పారామిలీటరీ ఫోర్స్, పోలీసులకు గత 25 ఏళ్లుగా ఏకే 47 వంటి తుపాకులు సరఫరా చేసే జెన్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు రామ్ పోతినేనిని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసింది. ఇక పిలవడమే ఆలస్యం రామ్ వచ్చాడు. వస్తే వచ్చాడు కానీ..ఏకంగా అక్కడ ప్రదర్శనలో ఉంచిన గన్ చేతికి తీసుకొని అది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాడు. తను చేయబోయే సినిమాకు ఉపయోగపడుతుందని ఆయా ఆయుధాలకు సంబందించిన సమాచారంతా అడిగి మరీ తెలుసుకున్నారు.

ఏకే 47 గన్‌తో రామ్ పోతినేని (Twitter/Photo)
అంతేకాదు ఆయా తుపాలను చేతిలో తీసుకొని ఎలా పనిచేస్తుందో ట్రయల్స్ కూడా చేసాడు.ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. సినిమాల్లో ఎపుడు డమ్మీ తుపాకులతో పనిచేసే మాకు.. ఇలా రియల్ వెపన్స్ చూసే భాగ్యం కలిగడం ఎంతో థ్రిల్‌కు గురయ్యానన్నారు.

ఏకే 47 గన్‌తో రామ్ పోతినేని (Twitter/Photo)
ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందకు జెన్ టెక్నాలిజీస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసాడు.ఈ సందర్భంగా సంస్ధ ఎండీ చైర్మన్ అశోక్ అట్లూరి ఈ సందర్భంగా రామ్‌ను జ్ఞాపికతో సత్కరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.