పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సఫీస్ను షేక్ చేసింది. అయితే సినిమా విడుదలైన తర్వాత కొన్నిరోజుల పాటు... వీడియో సాంగ్స్‌ను మూవీటీం రిలీజ్ చేయలేదు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం పూరి ఈ సినిమాలో పాటల్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేశారు. అయితే ఇందులో దిమాక్ ఖరాబ్ సాంగ్...ఆడియన్స్‌ను ఎంతగానే ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సాంగ్‌ను యూట్యూబ్‌లో 30 మిలియన్స్ వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది.
ఇస్మార్ట శంకర్ మూవీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్టుతో రామ్ తన నెక్ట్స్ మూవీ కిశోర్ తిరుమల దర్శకత్వంలో తీస్తున్నాడు. గతంలో వీరద్దరి కాంబినేషన్లో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి ప్రేమకథా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సారి లవ్ స్టోరీ కాకుండా క్రైమ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ హిట్ ‘తడమ్’కి తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ismart Shankar, Ismart Shankar Movie Review, Tollywood, Tollywood Movie News, Tollywood news