ISMART SHANKAR CONTROVERSY PURIJAGAN ISMART SHANKAR CINEMA CONCEPT IS MINE SAYS ANANDAM FAME AKASH SR
వివాదంలో పూరీ ‘ఇస్మార్ట్ శంకర్’... ఆ సినిమా కాన్సెప్ట్ నాదే.. : హీరో ఆకాష్
ఇస్మార్ట్ శంకర్.. Photo: Twitter
‘ఇస్మార్ట్ శంకర్’.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సూపర్ కలెక్షన్స్‌తో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ వివాదం తెరపైకి వచ్చింది.
‘ఇస్మార్ట్ శంకర్’.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సూపర్ కలెక్షన్స్‌తో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. ‘ఇస్మార్ట్ శంకర్' సినిమా కాన్సెప్ట్ తనదేనని అంటున్నారు హీరో ఆకాష్. ‘ఇస్మార్ట్ శంకర్' సినిమా.. మరో వ్యక్తి మెదడును హీరోకి మార్చడమనే లైన్‌తో తెరకెక్కంది. ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్' నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లకుపైగా వసూలు చేసిందని అంటున్నారు నిర్మాతలు. అది అలా ఉంటే ఈ కాన్సెప్ట్ తనదని అంటున్నారు అప్పట్లో వచ్చిన ‘ఆనందం’ సినిమా హీరో ఆకాష్. అందులో భాగంగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. హీరో, రచయిత అయిన ఆకాష్ మాట్లాడుతూ.. ‘ఈ.. కాన్సెప్ట్‌తోనే తెలుగు, తమిళ భాషల్లో నేను రాసిన కథ, కథనాలతో.. నన్నే హీరోగా పెట్టి ఓ సినిమా తీశాం.. ఆ సినిమా తమిళంలో ‘నాన్ యార్’ పేరుతో విడుదలైంది. అదే సినిమాను తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ అనే పేరుతో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో నాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ షాక్ ఇచ్చిందన్నారు.
అయితే ఇదే ఈ విషయమై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను కలవాలనీ ప్రయత్నించాను. కానీ కుదరలేదు. దీంతో ఏమీ చేయలేక తమిళ నిర్మాతల సంఘంలో ఈ సినిమా గురించి ఫిర్యాదు చేసానని.. అయితే సమస్య వెంటనే పరిష్కారం అవ్వాలని.. ఈరోజు ఇక్కడ మీడియా ముందుకు వచ్చానిని తెలిపారు ఆకాష్.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.