ఇస్మార్ట్ శంకర్ స్టోరీ లీక్...పోలీసులను ఆశ్రయించిన పూరీ బ‌ృందం

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో రామ్ కాంబీనేషన్‌లో వస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమా స్టోరీ, సినిమా విడుదలకు ముందే లీకైనట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 8, 2019, 12:25 PM IST
ఇస్మార్ట్ శంకర్ స్టోరీ లీక్...పోలీసులను ఆశ్రయించిన పూరీ బ‌ృందం
ఇస్మార్ట్ శంకర్ సినిమా పోస్టర్ Photo: Twitter.com/purijagan
  • Share this:
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో రామ్ కాంబీనేషన్‌లో వస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమా స్టోరీ, సినిమా విడుదలకు ముందే లీకైనట్లు తెలుస్తోంది.  దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఈ చిత్ర యూనిట్‌కు అనుకోని షాక్ తగిలింది. ఈ సినిమా స్క్రిప్టు మొత్తం ఇన్స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. మురళీ కృష్ణ అనే వ్యక్తి తమ సినిమా స్క్రిప్టును 'బజ్ బాస్కెట్' అనే ఇన్స్టాగ్రామ్ గ్రూపులో పోస్ట్ చేసినట్టు ఈ సినిమా నిర్మాత ఛార్మి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఇన్స్టాగ్రామ్ నుంచి తమ సినిమా స్క్రిప్టును తీసేసేందుకు భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే విడుదలకు సిద్దమైన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం బ‌ృందం.. తన ప్రమోషన్స్‌ను కూడా  మొదలు పెట్టింది. అందులో భాగంగా చిత్రయూనిట్ తాజాగా ఓ మాస్ సాంగ్‌ను కూడా  రిలీజ్ చేసింది.

'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి ఛార్మి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
First published: June 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>