పూరీకి ఛార్మి ఇస్మార్ట్ ఆఫర్... జగన్ ఫిదా..

Ismrt Shankar | ఛార్మి ఇచ్చిన ఆఫర్‌కు పూరీ కూడా ఫిదా అయిపోయాడు.

news18-telugu
Updated: July 29, 2019, 8:02 PM IST
పూరీకి ఛార్మి ఇస్మార్ట్ ఆఫర్... జగన్ ఫిదా..
పూరీ జగన్నాథ్, ఛార్మి
  • Share this:
పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ధియేటర్లతో దుమ్ములేపుతోంది. హైదరాబాదీ యాసతో ఎనర్జిటిక్ రామ్ సినిమాను రక్తికట్టించాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్, రామ్ యాక్షన్ కలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. చాలా రోజుల తర్వాత పూరీ కెరీర్‌లో ఓ మంచి హిట్ సినిమా పడడంతో పూరీ అండ్ టీమ్ ఆకాశంలో తేలిపోతోంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మతో కలసి సినిమా యూనిట్ ఓ భారీ పార్టీ కూడా చేసుకుంది. ఆ పార్టీలో ఆర్జీవీ చేసిన రచ్చ కూడా అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వర్మ ట్రిపుల్ రైడింగ్‌తో వెళ్లి ఇస్మార్ట్ శంకర్ సినిమా చూడడం.. ఆ తర్వాత పోలీసులు ఆ బైక్ ఓనర్‌కి ఫైన్ వేయడం అంతా తెలిసింది. అయితే, ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి జరుగుతున్న పార్టీల్లో ఆ సినిమా నిర్మాత చార్మి కౌర్, దర్శకుడు పూరీ జగన్నాథ్, ఇంక ఇతర బ్యాచ్ అంతా కనిపిస్తుంది కానీ, ఉస్తాద్ ఇస్మార్ట్ రామ్ మాత్రం కనిపించలేదు. అయితే, సినిమా రిలీజ్‌కు ముందే అమెరికా వెళ్లిపోయిన రామ్ ఇప్పుడు రిటన్ అవుతున్నాడు. రెండు రోజుల్లో హైదరాబాద్‌లో అడుగుపెట్టబోతున్నాడు. దీంతో ఇస్మార్ట్ రామ్‌తో కలసి మరోసారి ఎంజాయ్ చేద్దాం అంటూ పూరీ జగన్నాథ్‌కు ఛార్మి కౌర్ ట్విట్టర్‌లో ఆఫర్ ఇచ్చింది.

ఛార్మి ఇచ్చిన ఆఫర్‌కు పూరీ కూడా ఫిదా అయిపోయాడు. బ్లాక్ బస్టర్ సినిమాను అదే రేంజ్‌లో ఎంజాయ్ చేద్దామంటూ రీ ట్వీట్ చేశాడు.అంటే ఇస్మార్ట్ శంకర్ టీమ్ మరోసారి రచ్చ చేయబోతుందన్నమాట. ఈ సారి ఎలా ఉంటుందో చూడాలి.
First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు