వాళ్ల ఆకలి తీరుస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్..

Nidhhi Agerwal: సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకన్న బ్యూటీ నిధి అగర్వాల్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 31, 2020, 10:44 PM IST
వాళ్ల ఆకలి తీరుస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్..
నిధి అగర్వాల్ హాట్ షో (nidhhi agerwal hot photos/instagram)
  • Share this:
సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకన్న బ్యూటీ నిధి అగర్వాల్. ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడు సినిమాలు లేకపోవడం.. షూటింగ్స్ కూడా లేకపోవడంతో ఈ భామ తనకు కొత్త పని పెట్టుకుంది. వలస కూలీల ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చింది నిధి. ఈ మధ్య కాలంలో టీవీల్లో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం.. చాలా మంది వలస కూలీలు ఆకలితో చచ్చిపోతున్నారు.

వలస కూలీలకు ఫుడ్ సప్లై చేస్తున్న నిధి అగర్వాల్ (nidhhi agerwal migrant workers)
వలస కూలీలకు ఫుడ్ సప్లై చేస్తున్న నిధి అగర్వాల్ (nidhhi agerwal migrant workers)


వాళ్ల ఆకలి తీర్చడానికి ప్రభుత్వాలతో పాటు చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ఇప్పుడు తన వంతుగా నిధి అగర్వాల్ కూడా ముందుకొచ్చింది. వాళ్ల కోసం స్వయంగా తానే ఇంట్లో సాండ్ విచ్‌లను సిద్ధం చేసింది నిధి. అవన్నీ ప్యాక్ చేసి కాలి నడకన స్వగ్రామాలకు వెళ్తున్న వలస కూలీలకు అందిస్తుంది నిధి అగర్వాల్. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది నిధి అగర్వాల్.

ఆ మధ్య ఛారిటీ సంస్థలకు కూడా విరాళాలు అందించిన నిధి. ఇప్పుడు వలస కూలీల ఆకలి తీరుస్తుంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. ఇప్పటికే పీఎం కేర్ ఫండ్.. వెల్ఫేర్ అఫ్ స్ట్రే డాగ్స్.. కరోనా క్రైసిస్ ఛారిటీ.. సీఎం రిలీఫ్ ఫండ్.. స్ఫూర్తి సంక్షేమ సేవా సంఘ్ మొదలైన వాటికి ఈమె విరాళం అయితే అందించింది. ఎంతిచ్చింది అనేది పక్కనబెడితే అన్నింటికి ఇవ్వడం కూడా మంచి పద్దతే. తెలుగులో అశోక్ గల్లా.. తమిళనాట జయం రవి సరసన భూమి చిత్రంలో నటిస్తుంది నిధి.
First published: May 31, 2020, 10:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading