‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. పూరీ ఈజ్ బ్యాక్ విత్ బ్లాక్ బస్టర్..

ఇస్మార్ట్ శంక‌ర్.. ఇప్పుడు ఈ చిత్రం గురించే అంతా చ‌ర్చించుకుంటున్నారు. అప్పుడే ఈ చిత్రం వచ్చి వారం రోజులు అయిపోయింది. ఈ వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 25, 2019, 1:05 PM IST
‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. పూరీ ఈజ్ బ్యాక్ విత్ బ్లాక్ బస్టర్..
ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 25, 2019, 1:05 PM IST
ఇస్మార్ట్ శంక‌ర్.. ఇప్పుడు ఈ చిత్రం గురించే అంతా చ‌ర్చించుకుంటున్నారు. అప్పుడే ఈ చిత్రం వచ్చి వారం రోజులు అయిపోయింది. ఈ వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 27.50 కోట్లు షేర్ వ‌సూలు చేసి ఔరా అనిపించింది ఈ చిత్రం. వారం రోజుల తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు సాగుతూనే ఉంది. విడుదలైన ఏడవ రోజు కూడా 1.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ రామ్ కెరీర్‌కు కూడా కావాల్సినంత ఊపు ఇచ్చింది. టెంప‌ర్ త‌ర్వాత స‌రైన విజ‌యం లేక చూస్తున్న పూరీ జ‌గ‌న్నాథ్‌కు ఈ చిత్రం ఊహించిన దానికంటే కూడా ఎక్కువే తీసుకొస్తుంది.

ismart shankar 1st week worldwide collections and ram first movie to cross 25 crore share at box office pk ఇస్మార్ట్ శంక‌ర్.. ఇప్పుడు ఈ చిత్రం గురించే అంతా చ‌ర్చించుకుంటున్నారు. అప్పుడే ఈ చిత్రం వచ్చి వారం రోజులు అయిపోయింది. ఈ వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసింది. ram,ram twitter,puri jagannadh twitter,ismart shankar twitter,ismart shankar box office collection,ismart shankar,ismart shankar collections,ismart shankar 1st week ww collections,ismart shankar movie collections,ismart shankar box office collections,ismart shankar collections report,ismart shankar first week collections,ismart shankar movie,ismart shankar movie first week collections,ismart shankar 1st day box office collection,ismart shankar songs,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ వసూళ్లు,తెలుగు సినిమా
ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్


18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంక‌ర్ వారం రోజుల్లోనే 27 కోట్లు వ‌సూలు చేసిందంటే బాక్సాఫ‌స్ ద‌గ్గ‌ర శంక‌ర్ ర‌చ్చ ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అస‌లు మాస్ సినిమా అంటే ఇలా ఉంటుందా అనేలా ఈ చిత్రం వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది. నిజానికి సినిమాలో ఏం లేక‌పోయినా కూడా మాస్ డైలాగులు.. పూరీ మార్క్ ఆటిట్యూడ్.. దీనికి శ్రీ‌రామ‌ర‌క్ష‌గా నిలిచాయి. ఇక రామ్ కూడా ఇస్మార్ట్ శంక‌ర్ పాత్ర‌కు ప్రాణం పోసాడు. హీరోయిన్ల గ్లామ‌ర్ షో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. నైజాంలో ఇప్ప‌టికే ఈ చిత్రం 11.50 కోట్లు షేర్ వ‌సూలు చేసింది.

ismart shankar 1st week worldwide collections and ram first movie to cross 25 crore share at box office pk ఇస్మార్ట్ శంక‌ర్.. ఇప్పుడు ఈ చిత్రం గురించే అంతా చ‌ర్చించుకుంటున్నారు. అప్పుడే ఈ చిత్రం వచ్చి వారం రోజులు అయిపోయింది. ఈ వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసింది. ram,ram twitter,puri jagannadh twitter,ismart shankar twitter,ismart shankar box office collection,ismart shankar,ismart shankar collections,ismart shankar 1st week ww collections,ismart shankar movie collections,ismart shankar box office collections,ismart shankar collections report,ismart shankar first week collections,ismart shankar movie,ismart shankar movie first week collections,ismart shankar 1st day box office collection,ismart shankar songs,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ వసూళ్లు,తెలుగు సినిమా
ఇస్మార్ట్ శంకర్.. Photo: Twitter



ఇక సీడెడ్ 4.20 కోట్లు.. ఉత్తరాంధ్ర 2.98 కోట్లు.. వెస్ట్ 1.33.. కృష్ణ 1.59.. గుంటూరు 1.67.. నెల్లూరు 0.83 కోట్లు వ‌సూలు చేసింది ఇస్మార్ట్ శంక‌ర్. ఇప్ప‌టికే ఈ చిత్రం ఏపీ, తెలంగాణ‌ల్లో 25.22 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఓవ‌ర్సీస్ కూడా క‌లిపితే 27 కోట్ల‌కు చేరిపోయింది ఈ లెక్క‌. మొత్తానికి పూరీ కోరుకుంటున్న బ్లాక్ బ‌స్ట‌ర్ ఇన్ని రోజుల‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే అన్ని ఏరియాల్లోనూ సినిమాను కొన్న బ‌య్య‌ర్లు లాభాల్లోకి వ‌చ్చేసారు. భారీ లాభాల దిశ‌గా వాళ్లు ప‌య‌నిస్తున్నారు కూడా. ఈ వారం డియర్ కామ్రేడ్ వస్తున్నా కూడా కచ్చితంగా వీకెండ్స్ ఇస్మార్ట్ శంకర్ కుమ్మేసేలా కనిపిస్తున్నాడు.
First published: July 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...