గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో సరైన సినిమాలు లేని టైమ్‌లో విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ పెట్టిన పెట్టుబడికి రెండింతలు తీసుకొచ్చింది. ఓవర్సీస్ మార్కెట్ తప్పించి విడుదలైన అన్ని చోట్ల ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దుమ్ము దులిపుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా ఈ గురువారంతో మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్‌గా రన్ అవుతూ ఉంది. తాజాగా ఈ సినిమా రూ.35.51 కోట్ల షేర్ .. రూ. 71.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలంగాణ,ఏపీలో రూ. 32.70 కోట్లను కొల్లగొట్టింది ఇస్మార్ట్ శంకర్. కర్ణాటకలో ఈ సినిమా రూ. 1.45 కోట్లను ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా రూ. కోటి వరకు రాబటట్టింది. చాలా రోజుల తర్వాత ఇస్మార్ట్ శంకర్‌తో మంచి విజయం దక్కడంతో రామ్ ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ‘డియర్ కామ్రేడ్’ వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు సాగుతూనే ఉంది.పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ రామ్ కెరీర్‌కు మంచి ఊపు ఇచ్చిందనే చెప్పాలి.
ఎన్టీఆర్‌తో చేసిన ‘టెంపర్’ తర్వాత సరైన విజయం లేని పూరీ జగన్నాథ్‌కు ‘ఇస్మార్ట్ శంకర్’ ఊహించిన దానికంటే కూడా ఎక్కువే తీసుకొస్తుంది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంకర్ 14 రోజుల్లోనే 35.51 కోట్లు వసూలు చేసిందంటే బాక్సాఫస్ దగ్గర ‘ఇస్మార్ట్ శంకర్’ రచ్చ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మాస్ సినిమా అంటే ఇలా ఉంటుందా అనేలా ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాను బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవడమే కాదు.. కొన్న దానికి రెండింతలు లాభాలు తీసుకొచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్2 వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు మాత్రం తగ్గడం లేదు. త్వరలోనే ఈ సినిమాకు భారీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Box Office Collections, Ismart Shankar, Nabha Natesh, Nidhhi Agerwal, Puri Jagannadh, Ram Pothineni, Telugu Cinema, Tollywood, Tollywood Box Office Report