ఇస్మార్ట్ శంకర్.. ఇప్పుడు ఈ చిత్రం గురించే అంతా చర్చించుకుంటున్నారు. అప్పుడే ఈ చిత్రం వచ్చి 12 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 32.50 కోట్లు షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది ఈ చిత్రం. డియర్ కామ్రేడ్ వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు సాగుతూనే ఉంది. విడుదలైన 13వ రోజుల బోనాలు సందర్భంగా హాలీడే వస్తే ఆ రోజు కూడా 2 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ రామ్ కెరీర్‌కు కూడా కావాల్సినంత ఊపు ఇచ్చింది.
టెంపర్ తర్వాత సరైన విజయం లేక చూస్తున్న పూరీ జగన్నాథ్‌కు ఈ చిత్రం ఊహించిన దానికంటే కూడా ఎక్కువే తీసుకొస్తుంది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంకర్ 12 రోజుల్లోనే 32.50 కోట్లు వసూలు చేసిందంటే బాక్సాఫస్ దగ్గర శంకర్ రచ్చ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మాస్ సినిమా అంటే ఇలా ఉంటుందా అనేలా ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తుంది.
నిజానికి సినిమాలో ఏం లేకపోయినా కూడా మాస్ డైలాగులు.. పూరీ మార్క్ ఆటిట్యూడ్.. దీనికి శ్రీరామరక్షగా నిలిచాయి. ఇక రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ పాత్రకు ప్రాణం పోసాడు. హీరోయిన్ల గ్లామర్ షో అదనపు ఆకర్షణ. నైజాంలో ఇప్పటికే ఈ చిత్రం 14.50 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ ఏపీ, తెలంగాణల్లో 31.22 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఓవర్సీస్ కూడా కలిపితే 33 కోట్లకు చేరిపోయింది ఈ లెక్క. మొత్తానికి పూరీ కోరుకుంటున్న బ్లాక్ బస్టర్ ఇన్ని రోజులకు వచ్చేసింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లోనూ సినిమాను కొన్న బయ్యర్లు లాభాల్లోకి వచ్చేసారు. కొన్నిచోట్ల అయితే రెండింతలు లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. డియర్ కామ్రేడ్ వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు మాత్రం తగ్గడం లేదు. త్వరలోనే ఈ సినిమాకు భారీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.