ఇస్మార్ట్ హీరో రామ్ ‘రెడ్’ మూవీకి ఓటీటీలో మరోసారి అదిరిపోయే ఆఫర్..

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమా చేసాడు.  ఈ సినిమాకు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది.

news18-telugu
Updated: July 9, 2020, 10:58 PM IST
ఇస్మార్ట్ హీరో రామ్ ‘రెడ్’ మూవీకి ఓటీటీలో మరోసారి అదిరిపోయే ఆఫర్..
రామ్ రెడ్ పోస్టర్ Photo : Twitter
  • Share this:
గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఇస్మార్ట్ సక్సెస్ అందుకున్నాడు రామ్. ఈ సినిమాలో రామ్ తనదైన హైదరాబాదీ యువకుడి పాత్రలో ఇరగదీసాడు. అంతేకాదు ఆ పాత్రలో రామ్ తప్పించి మరో నటుడిని ఊహించుకోలేనంత రేంజ్‌లో నటించి నిజంగా ఇస్మార్ట్ హీరో అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమా చేసాడు.  తమిళంలో హిట్టైన  క్రైమ్ థ్రిల్లర్  ‘తడమ్’ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవి కిషోర్ ఈ సినిమాను నిర్మించాడు.  హీరో రామ్ ఈ సినిమాలో తొలిసారి ద్విపాత్రాభినయం చేసాడు. ఈ సినిమాలో రామ్ సరసన  నివేదా థామస్, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌లు హీరోయిన్‌లుగా నటించారు.అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది చిత్రబృందం. కానీ మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. కరోనా వల్ల దేశంలో మరణాలతో పాటు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ప్రకటించారు.

Ram pothineni red film,red film business details,red film business,Ram Pothineni,Ram Pothineni twitter,Ram Pothineni red,Ram Pothineni red movie,Ram Pothineni red movie teaser,red movie teaser,red movie nivetha pethuraj,red movie malvika sharma,రెడ్ టీజర్,రామ్ పోతినేని రెడ్ టీజర్,కిషోర్ తిరుమల రెడ్ టీజర్
రెడ్ పోస్టర్ Photo : Twitter


ప్రస్తుతం దేశంలో అన్‌లాక్ ప్రకటించినా... థియేటర్స్, మల్టీప్లెక్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు.  దీంతో ఈ సినిమాను డిజిటల్‌లో విడుదల చేయనున్నారనే వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయి. ఈ వార్తల్నీ రామ్ తన సోషల్ మీడియా వేదికగా ఖండించాడు. అప్పట్లో ఓ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఈ సినిమాను రూ. 20 కోట్లకు హోల్‌సేల్ ఈ సినిమా హక్కులు ఇవ్వమని అడిగారు. తాజాగా అదే స్ట్రీమింగ్ సంస్థ ఈ సినిమా కోసం రూ. 30 కోట్లను ఆఫర్ చేసారట. అయితే రామ్‌ మాత్రం ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా థియేటర్స్‌లో విడుదల చేసాకా.. కానీ ఓటీటీలో విడుదల చేయమని ఖరాఖండీగా చెప్పారట. మరోవైపు దేశంలో నానాటికీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో కొన్ని నెలల పాటు థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితులు లేకుంటే ఈ  సినిమాను ఓటీటీలో విడుదల చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ‘రెడ్’ సినిమా నిర్మాతలు అప్పటి వరకు వేచి చూస్తారా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 9, 2020, 10:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading