Home /News /movies /

ఇస్మార్ట్ శంకర్ చేసిన పనికి... షాక్ అవుతున్న అభిమానులు

ఇస్మార్ట్ శంకర్ చేసిన పనికి... షాక్ అవుతున్న అభిమానులు

రామ్ పోతినేని

రామ్ పోతినేని

తన 18వ సినిమాలోని ఫ్రెష్ లుక్‌ కోసం రామ్ ఇలా చేస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో చూసిన రామ్ ఫాలోవర్స్ అంతా షాక్ అవుతున్నారు.

    ఫిట్‌నెస్ అంటే ప్రాణం ఇస్తాడు హీరో రామ్. తన సినిమాలో క్యారెక్టర్‌కు అనుగుణంగా తన బాడీని బిల్డప్ చేసుకుంటుంటాడు. తాజాగా ఇస్మార్ శంకర్ ఇచ్చిన సక్సెస్‌తో మంచి ఊపు మీదున్న ఈ యువ హీరో... నెక్ట్స్ సినిమా కోసం ఇప్పట్నుంచే ఎక్సర్‌సైజ్ ప్రారంభించేశాడు. జిమ్‌లో తాజాగా రామ్ 1000 పౌండ్లతో (దాదాపు 450 కిలోలు) లెగ్‌ ప్రెస్‌ కసరత్తులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీంతోపాటు #RAPO18 ‬అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా యాడ్ చేశాడు. తాజాగా తన 18వ సినిమాలోని ఫ్రెష్ లుక్‌ కోసం రామ్ ఇలా సిద్ధమౌతున్నట్లు తెలిపారు. ఈ వీడియో చూసిన రామ్ ఫాలోవర్స్ అంతా షాక్ అవుతున్నారు. ఏమైనా ఫిట్ నెస్ అంటూ కొనియాడుతున్నారు.

    రామ్ తన నెక్ట్స్ మూవీ కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో తీస్తున్నారు. గతంలో వీరద్దరి కాంబినేషన్‌లో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి ప్రేమకథా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సారి లవ్ స్టోరీ కాకుండా క్రైమ్‌ నేపథ్యంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ హిట్‌ ‘తడమ్‌’కి తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దసరాకి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.


    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Gym, Ismart Shankar, Ram Pothineni, Tollywood, Tollywood Cinema, Tollywood Movie News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు