పూరీ జగన్నాథ్ సంచలన నిర్ణయం.. ఆ దర్శకులకు ఆర్థిక సాయం..

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మళ్లీ పుంజుకున్నాడు పూరీ జగన్నాథ్. ఈ చిత్రంతో దాదాపు 30 కోట్లకు పైగానే లాభాలు అందుకున్నాడు ఈ దర్శక నిర్మాతలు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 27, 2019, 4:29 PM IST
పూరీ జగన్నాథ్ సంచలన నిర్ణయం.. ఆ దర్శకులకు ఆర్థిక సాయం..
పూరీ జగన్నాథ్ (Source: Twitter)
  • Share this:
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మళ్లీ పుంజుకున్నాడు పూరీ జగన్నాథ్. ఈ చిత్రంతో దాదాపు 30 కోట్లకు పైగానే లాభాలు అందుకున్నాడు ఈ దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు మంచి పనులు కూడా చేస్తున్నాడు ఈయన. సెప్టెంబర్ 28న పూరీ జన్మదినం. ఎప్పట్లా కేక్ కట్ చేసి.. పార్టీ చేసుకోకుండా ఈ సారి కాస్త వెరైటీగా తన పుట్టినరోజును ప్లాన్ చేస్తున్నాడు పూరీ. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు దర్శకులుగా ఉండి.. సినిమాలు చేసి.. ఇప్పుడు పూర్తిగా ఫేడవుట్ అయిపోయి కష్టాల్లో ఉన్న వాళ్లకు తోచినంత ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు పూరీ.

Ismart director Puri Jagannadh showing his humanity and will decide to give money to poor directors pk ఇస్మార్ట్ శంకర్ సినిమాతో దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మళ్లీ పుంజుకున్నాడు పూరీ జగన్నాథ్. ఈ చిత్రంతో దాదాపు 30 కోట్లకు పైగానే లాభాలు అందుకున్నాడు ఈ దర్శక నిర్మాతలు. puri jagannadh,puri jagannadh director,puri jagannadh twitter,puri jagannadh charmee,puri jagannadh charmi kaur,charmy kaur twitter,puri jagannadh birthday,telugu cinema,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఛార్మి కౌర్,పూరీ జగన్నాథ్ పుట్టినరోజు,తెలుగు సినిమా,దర్శకులకు ఆర్థిక సాయం చేస్తున్న పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్ (Source: Twitter)

ఈ పనికి ఛార్మి కూడా తోడుగా ఉంది. దీనికోసం అలా ఖాళీగా ఉన్న ఓ 20 మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లకు ఎంచుకున్నాడు పూరీ జగన్నాథ్. సెప్టెంబర్ 28న ఒక్కొక్కరికి 50 వేల చొప్పున సాయం చేయబోతున్నాడు ఈ డేరింగ్ డైరెక్టర్. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని.. మన దగ్గర ఉన్నపుడు సాయం చేయడం తప్పేం కాదంటున్నాడు పూరీ. ఒకప్పుడు సినిమా కోసమే తమ జీవితాన్ని అంకితం చేసి.. సినిమాతోనే మమేకమైపోయిన వాళ్లను ఆదుకోవడం కూడా బాధ్యతే అంటున్నాడు పూరీ.

Ismart director Puri Jagannadh showing his humanity and will decide to give money to poor directors pk ఇస్మార్ట్ శంకర్ సినిమాతో దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మళ్లీ పుంజుకున్నాడు పూరీ జగన్నాథ్. ఈ చిత్రంతో దాదాపు 30 కోట్లకు పైగానే లాభాలు అందుకున్నాడు ఈ దర్శక నిర్మాతలు. puri jagannadh,puri jagannadh director,puri jagannadh twitter,puri jagannadh charmee,puri jagannadh charmi kaur,charmy kaur twitter,puri jagannadh birthday,telugu cinema,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఛార్మి కౌర్,పూరీ జగన్నాథ్ పుట్టినరోజు,తెలుగు సినిమా,దర్శకులకు ఆర్థిక సాయం చేస్తున్న పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్ ఛార్మి కౌర్
పైగా ఇదేమీ పెద్ద సహాయం కాదని.. నిరుత్సాహంలో ఉన్న వాళ్లకు చిన్న చిరునవ్వు లాంటి పలకరింపని చెబుతున్నాడు పూరీ. వాళ్లు బాగుండాలని ఆ దేవున్ని ప్రార్థించే కంటే కూడా కాస్త సాయం చేస్తే అది మంచిది కదా అంటున్నాడు పూరీ జగన్నాథ్. దేవుడు కరుణిస్తే ఇలాగే ప్రతీ ఏడాది చేస్తానంటున్నాడు పూరీ జగన్నాథ్. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ పూర్తిగా మారిపోయాడు. ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
First published: September 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు