పూరీ జగన్నాథ్‌కు ఇస్మార్ట్ శంకర్ స్పెషల్ గిఫ్ట్..ఫీల్ అవుతోన్న ఛార్మి

Puri jagannadh Ram Pothineni Charmy Kaur Ismart Shankar kopi Luwak Panicker Coffee | గతం కొంతకాలంగా ఫ్లాపుల్లో ఉన్న రామ్..అంతకన్నా దారుణమైన డిజాస్టర్స్‌తో రేసులో వెనకబడ్డ పూరీ జగన్నాథ్ కలయికలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోగా నటిస్తోన్న రామ్..దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఓ కాఫీ గింజల ప్యాకెట్‌ను గిఫ్ట్‌ ఇచ్చాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 5, 2019, 2:07 PM IST
పూరీ జగన్నాథ్‌కు ఇస్మార్ట్ శంకర్ స్పెషల్ గిఫ్ట్..ఫీల్ అవుతోన్న ఛార్మి
ఛార్మి, రామ్, పూరీ జగన్నాథ్
  • Share this:
గతం కొంతకాలంగా ఫ్లాపుల్లో ఉన్న రామ్..అంతకన్నా దారుణమైన డిజాస్టర్స్‌తో రేసులో వెనకబడ్డ పూరీ జగన్నాథ్ కలయికలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఫ్లాపుల్లో ఉన్న వీళ్లిద్దరు రిలీజ్ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ ‌లుక్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. డిఫరెంట్ షేడ్‌లో ఉన్న రామ్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్’ లో రామ్ .. హైదరాబాద్‌కు చెందిన డబుల్ దిమాక్ ఇస్మార్ట్ పోరడి పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ప్రారంభమైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో రామ్‌కు జోడిగా నిధి అగర్వాల్, నభా నటాష్ ఇస్మార్ట్ హైదరాబాద్ పోరీలుగా నటిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పూరీ స్టైల్లో ఉండబోతుందనే విషయం అర్థమవుతోంది

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోగా నటిస్తోన్న రామ్..దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఓ కాఫీ గింజల ప్యాకెట్‌ను గిఫ్ట్‌ ఇచ్చాడు. ఈ విషయాన్ని పూరీ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. మేరా ఇస్మార్ట్ శంకర్’ నాకు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కాఫీని కానుకగా ఇచ్చాడు.


Loading...
దీనిని కోపీ లువాక్ అంటారు. దీని గురించి గూగుల్‌లో వెతకండి. మీకు ఈ కాపీ గురించి తెలిస్తే పిచ్చేక్కిపోతుందన్నాడు. నేను ఈ కాఫీని తాగుతున్నాను అంటూ ఫోటోలను ఫోస్ట్ చేశాడు.పూరీ పోస్ట్‌కు రామ్ రిప్లై ఇస్తూ..ఈ కాపీ గురించి గూగుల్‌లో వెతక్కండి. దీని గురించి తెలిస్తే దిమాగ్ ఖరాబ్ ఐతది అని చమత్కరించారు. ఈ కోపీ లువాక్ కాపీని చెర్రీస్‌తో తయారు చేస్తారని చెప్పారు. ఈ కాఫీ ఇండోనేషియా తదితర దీవుల్లో పండుతుందని చెప్పుకొచ్చాడు. దీని ఒక్కో కప్పు కాఫీ ధర సుమారు 35 డాలర్ల నుంచి 80 డాలర్ల వరకు ఉంటుంది. ఐతే పూరీ తనకు త్వరలో మంచి సక్సెస్ అందివ్వనున్నాడనే కాన్ఫిడెన్స్‌తో రామ్..ఇస్మార్ట్‌గా ఈ గిఫ్ట్ పంపించినట్టు అందరు చెప్పుకుంటున్నారు.పూరీ చేసిన ట్వీట్ చూసి..రామ్ తనకెందుకు బహుమతి ఇవ్వలేదన్నట్టు షిట్ షిట్ షిట్ అంటూ కామెంట్ చేసింది ఛార్మి.రాశిఖన్నా హాట్ ఫోటోస్ 


ఇది కూడా చదవండి

రాజకీయాల్లో ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మోహన్‌లాల్

‘URI’ ది సర్టికల్ స్ట్రైక్ దెబ్బకు తోక ముడిచిన ‘బాహుబలి’

‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఉచితం.. తండ్రి బాకీ తీర్చేస్తున్న బాలయ్య..

 
First published: February 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...