విజయ్ దేవరకొండకు ఏమైంది.. మిడిల్ ఫింగర్‌కు ఆ కట్టు ఏంటి..?

Vijay Devarakonda : సైమా అవార్డ్స్-2019లో గీతగోవిందం సినిమాకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడిగా విజయ్ దేవరకొండ అవార్డు దక్కించుకున్నాడు. అలాగే సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ నటుడిగానూ అవార్డు అందుకున్నాడు.

news18-telugu
Updated: August 16, 2019, 3:46 PM IST
విజయ్ దేవరకొండకు ఏమైంది.. మిడిల్ ఫింగర్‌కు ఆ కట్టు ఏంటి..?
సైమా అవార్డ్స్ వేడుకలో విజయ్ దేవరకొండ
  • Share this:
సైమా అవార్డ్స్-2019 వేడుకల్లో మెరిసిన టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. తన కుడిచేతి మిడిల్ ఫింగర్‌కు కట్టుతో కనిపించాడు. దీంతో దేవరకొండకు ఏమైంది..? అంటూ ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. అప్పట్లో డియర్ కామ్రేడ్ షూటింగ్ సమయంలో గాయపడ్డ దేవరకొండ.. మళ్లీ గాయపడ్డాడా..! అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా.. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాల షూటింగ్స్‌లో విజయ్ ఏమైనా గాయపడ్డాడా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ సందర్భంగా బాగానే కనిపించిన విజయ్ దేవరకొండ 15 రోజుల గ్యాప్‌లోనే ఇలా కట్టుతో కనిపించడంతో.. ఏమై ఉంటుందా అని చర్చిస్తున్నారు. ఇకపోతే సైమా అవార్డ్స్-2019లో గీతగోవిందం సినిమాకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడిగా విజయ్ దేవరకొండ అవార్డు దక్కించుకున్నాడు. అలాగే సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ నటుడిగానూ అవార్డు అందుకున్నాడు.

ఇదిలా ఉంటే,డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టడంతో.. తదుపరి సినిమాపై విజయ్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. మరోవైపు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్‌తోనూ సినిమా ఓకె చేశాడు. డియర్ కామ్రేడ్ ఫెయిల్యూర్‌ను రాబోయే సినిమాలతో మరిపించాలని విజయ్ భావిస్తున్నాడు.


First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు