ఉదయ్ కిరణ్ చివరి సినిమా ఓటిటిలో విడుదల కానుందా..?

Uday Kiran Last movie: థియేటర్స్ బంద్ అయిన తర్వాత చాలా మంది నిర్మాతల కన్ను ఓటిటి విడుదలపై పడింది. అయితే క్రేజీ సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలను కూడా డిజిటల్‌లో విడుదల చేసి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2020, 8:58 PM IST
ఉదయ్ కిరణ్ చివరి సినిమా ఓటిటిలో విడుదల కానుందా..?
ఉదయ్ కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ (uday kiran last movie in OTT)
  • Share this:
థియేటర్స్ బంద్ అయిన తర్వాత చాలా మంది నిర్మాతల కన్ను ఓటిటి విడుదలపై పడింది. అయితే క్రేజీ సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలను కూడా డిజిటల్‌లో విడుదల చేసి చేతులు దులిపేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే చాలా సినిమాలు ఇలా వచ్చాయి కూడా. కొన్ని సినిమాలు థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు కూడా ఓపిక పట్టలేక మధ్యలోనే ఓటిటి ప్లాట్ ఫామ్‌పై దర్శనం ఇచ్చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా దిల్ బెచారాను కూడా హాట్ స్టార్ ప్లస్ డిస్నీ కొనేసింది. జులై 24న ఈ సినిమా ఆన్‌లైన్‌లో విడుదల కానుంది.

ఉదయ్ కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ (uday kiran last movie in OTT)
ఉదయ్ కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ (uday kiran last movie in OTT)


ఇదిలా ఉంటే సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఉదయ్ కిరణ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉండటమే దీనికి కారణం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హ్యాట్రిక్ విజయాలు అందుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఇద్దరూ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకున్నారు. పైగా ఇద్దరి మరణానికి కారణం డిప్రెషన్ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా తరహాలోనే ఇప్పుడు ఉదయ్ నటించిన చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ' కూడా ఓటిటిలో విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది.

ఉదయ్ కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ (uday kiran last movie in OTT)
ఉదయ్ కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ (uday kiran last movie in OTT)


ఉదయ్ కిరణ్ చనిపోయి ఆరేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈ చిత్రం విడుదల కాలేదు. ఇన్నాళ్లూ థియేటర్స్‌లో విడుదల చేస్తే చూస్తారో లేదో అనే అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఓటిటి వచ్చిన తర్వాత ఉదయ్ చివరి సినిమా అనే క్రేజ్ కారణంగా అయినా చూస్తారనే నమ్ముతున్నారు నిర్మాతలు. అందుకే చిత్రం చెప్పిన కథను విడుదల చేసి ఉంటే మంచి లాభాలు వచ్చేవి అనేది విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు నిర్మాతలు కూడా ఇదే చేయాలని చూస్తున్నారు. ఉదయ్ కిరణ్ అభిమానులు కూడా తమ హీరో చివరి సినిమాను చూడాలనుకుంటున్నారు. మరి చూడాలిక.. వాళ్ల కోరిక తీరుతుందో లేదో..?
First published: June 25, 2020, 8:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading