IS TRISHA INSTAGRAM POST IS ABOUT RANA HERE ARE THE DETAILS SR
త్రిష వివాదస్పద పోస్ట్ రానా గురించేనా.. డిలేట్ ఎందుకు చేసినట్లు..
రానా, త్రిష Photo : Twitter
త్రిష, రానా గతంలో ప్రేమించుకున్నారని ఓ వార్త అప్పట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రానా తన ప్రేయసి మిహికాను పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించిన నేపథ్యంలో త్రిష ఓ పోస్ట్ పెట్టి డిలేట్ కూడా చేసింది.
Trisha Krishnan : త్రిష కృష్ణన్, 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది. ఆ తర్వతా నుండి త్రిష సినిమాల కోసం ఎదురుచూసింది లేదు. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్లలో ఒకరుగా ఉన్నారు. వరుసగా 'వర్షం', 'నువ్వస్తానంటే నేనోదంటానా', 'అతడు' లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో ఓ వెలుగు వెలిగింది. అది అలా ఉంటే ఈ చెన్నై చంద్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ తెలిసిందే. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై పోస్ట్ పెడుతూ ఉంటుంది. అందులో భాగంగా రీసెంట్గా ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఆ పోస్ట్ రానాతో రిలేషన్ గురించేనని అనుకుంటున్నారు నెటిజన్స్.. ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించి పెట్టిన ఆ పోస్ట్ వైరల్ కావడంతో వెంటనే డిలీట్ చేసిందని ప్రచారం జరుగుతుంది. త్రిష తన పోస్ట్‌లో.. నాకు తెలుసు. ఎవరైతే తమ మాజీ ప్రియురాళ్ళని స్నేహితులిగా అభివర్ణిస్తారో, వారు అహంకారులుగా మిగిలిపోతారని ఆ పోస్ట్ సారాంశం. ఇక ఈ పోస్ట్‌ని చూసిన నెటిజన్స్.. ఈ పోస్ట్ ఖచ్చితంగా రానా గురించే పెట్టి ఉంటుందని చర్చించుకుంటున్నారు. గతంలో రానా, త్రిషలు డేటింగ్లో ఉండగా, ఏవో కారణాల వలన ఇద్దరు విడిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే త్రిష తాజా పోస్ట్‌కు కారణం ఏమంటే.. రానా తాజాగా తన గర్ల్ ఫ్రెండ్ మిహీకా బజాజ్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్ట్ చేసిందని.. తీరా అది వైరల్‌గా మారడంతో డిలేట్ చేసిందని అంటున్నారు నెటిజన్స్.
ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష చేసిన పోస్ట్ Photo : Instagram
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.