అల వైకుంఠపురం బ్లాక్ బస్టర్ తర్వాత పూజా హెగ్డే ఎంత పని చేసింది?

టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలసి అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే టాటా చెప్పేస్తోంది.

news18-telugu
Updated: February 22, 2020, 2:17 PM IST
అల వైకుంఠపురం బ్లాక్ బస్టర్ తర్వాత పూజా హెగ్డే ఎంత పని చేసింది?
పూజా హెగ్డే (Instagram/Photo)
  • Share this:
టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలసి అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే టాటా చెప్పేస్తోంది. వరుసగా సినిమా చాన్స్‌లు దక్కే చాన్స్ ఉన్నా.. వాటన్నిటినీ వదులుకొని ముంబై ఫ్లైట్ ఎక్కనుంది. అదేంటి, మంచి చాన్స్‌లు వదులుకుని ముంబై వెళ్లి ఏం చేస్తుందని అనుకుంటున్నారా? బాలీవుడ్ నుంచి అవకాశాలు తలుపుతడుతున్నాయి. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్‌గా పూజాహెగ్డే పేరు ఖరారైంది. నదియాద్ వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్ మీద ఫర్హద్ సాంజి డైరెక్షన్‌లో వస్తున్న ‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకున్నారు. బాలీవుడ్‌లో వెరైటీ సినిమాలతో వరుస హిట్లు కొడుతున్న అక్షయ్ కుమార్ సినిమాలో కూడా పూజా హెగ్డేను తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. వీరిద్దరితోపాటు అజయ్ దేవగణ్ సినిమాలో కూడా పూజా హెగ్డేను తీసుకోవడానికి చర్చలు జరుపుతున్నారు.

అల్లు అర్జున్, పూజా హెగ్డే


గతంలో సంతకం చేసిన సినిమాలు మినహా మళ్లీ కొత్తగా తెలుగు సినిమాలను పూజాహెగ్డే ఒప్పుకోవడం లేదు. తన కెరీర్‌లో మైల్ స్టోన్ లాంటి అల వైకుంఠపురములో సినిమా ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్‌తో తీయబోయే సినిమాలో నటించేందుకు పూజా హెగ్డే నిరాకరించినట్టు తెలిసింది. దీంతో మరో హీరోయిన్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ వెతుకుతున్నారు. గతంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించేందుకు కమిట్ అయింది. అలాగే, రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న జాన్ సినిమాలో కూడా పూజాహెగ్డే మెయిన్ హీరోయిన్. గతంలో అగ్రిమెంట్ చేసుకున్న సినిమాలే కానీ, కొత్తగా సినిమాలకు పూజా సంతకం చేయడం లేదు.

First published: February 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు