• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • IS THE MOMENT FOR TRIVIKRAM SRINIVASS CRAZY PROJECT WITH ISMART HERO RAM POTHINENI OVER TA

Ram-Trivikram: ఇస్మార్ట్ హీరో రామ్‌తో త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారైందా.. ?

Ram-Trivikram: ఇస్మార్ట్ హీరో రామ్‌తో త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారైందా.. ?

రామ్ పోతినేని డైరెక్ట్ చేయనున్న త్రివిక్రమ్ (Twitter/Photo)

Ram-Trivikram Srinivas | దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనితో చేయనున్నాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Ram-Trivikram Srinivas | దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనితో చేయనున్నాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. త్రివిక్రమ్.. ఈ యేడాది అల్లు అర్జున్ హీరోగా  ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా తన తర్వాతి ప్రాజెక్ట్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, త్రివిక్రమ్ హోమ్ ప్రొడక్షన్ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కనుంది. కానీ ఎన్టీఆర్.. మాటల మాంత్రికునితో సినిమా చేయాలంటే ముందుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తి చేయాల్సిందే. ఆ సినిమా పూర్తి కానిదే.. తారక్..వేరే ప్రాజెక్ట్స్‌కు  కమిట్ కాకూడనేది జక్కన్న నిర్ణయం. అందుకు త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేయాలనకున్న ప్రాజెక్ట్ మరో ఆరు నెలలు ఆలస్యం కానుంది.  ఈ లోపు త్రివిక్రమ్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను రామ్ తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

    Is the moment for Trivikram srinivass crazy project with Ismart hero Ram pothineni over,Ram Pothineni,Trivirkram Srinivas,Ram Pothineni Twitter,Trivikram Movies,Ram-Trivikram: Twitter,Ram-Trivikram instagram,trivikram srinivas ram pothineni,tollywood,telugu cinema,ram pothineni Twitter,ram pothineni Red movie,ram pothineni ismart shankar,ram pothineni instagram,ram pothineni,Tollywood,Telugu cinema,ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని,రామ్ పోతినేని,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ రామ్,రామ్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్
    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ పోతినేని (Twitter/Photo)


    ఈ సినిమాను త్రివిక్రమ్.. రామ్‌కు సంబంధించిన స్రవంతి పిక్చర్స్ బ్యానర్‌లో తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇక త్రివిక్రమ్‌కు దర్శకుడిగా మొదటి అవకాశం స్రవంతి రవికిషోర్.. బ్యానర్‌లో తెరకెక్కిన ‘నువ్వే నువ్వే’ సినిమాతో వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యానర్‌లో త్రివిక్రమ్ మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. కానీ అప్పట్లో ఈ సినిమా వీలు పడలేదు. ‘నువ్వే నువ్వే’ తర్వాత దర్శకుడిగా త్రివిక్రమ్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు.  ఈ క్రమంలో మాటల మాంత్రికుడు రామ్ పోతినేనితో ఒక వెరైటీ సబ్జెక్ట్ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. చాలా రోజుల తర్వాత తన ఓన్ బ్యానర్ వంటిది అయినా.. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్‌లో కాకుండా స్రవంతి బ్యానర్‌లో ఈ సినిమా చేయనున్నట్టు సమాచారం.  ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఈ నెల 7న త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక రామ్ కూడా ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇపుడు ‘రెడ్2 సినిమాతో సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు. ఫస్ట్ టైమ్ తన కెరీర్‌లో ఓ సినిమాలో ద్విపాత్రాభినయం ఈ చిత్రంలో చేసాడు రామ్. త్రివిక్రమ్, రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ  చిత్రాన్ని ఈ నెలలోనే మొదలు పెట్టి.. నాలుగైదు  నెలల్లో కంప్లీట్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడట. ఇప్పటికే  ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌తో పాటు అన్ని పనులను త్రివిక్రమ్ పూర్తి చేసినట్టు సమాచారం.  ఎన్టీఆర్ ఫ్రీ అయితే.. రంగంలోకి దిగడమే ఆలస్యం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు