ఆ సీన్లలో నటించలేకే.. సాయి పల్లవి, విజయ్ దేవరకొండ సినిమాను వదిలేసిందా..!

సాయి పల్లవి.. 'ఫిదా' సినిమాతో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న అందాల నటి. తమిళ భామ అయిన.. 'ఫిదా' సినిమాలో చక్కగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. అందమైన నటనతో అందర్ని కట్టిపడేసింది.

news18-telugu
Updated: July 18, 2019, 12:00 PM IST
ఆ సీన్లలో నటించలేకే.. సాయి పల్లవి, విజయ్ దేవరకొండ సినిమాను వదిలేసిందా..!
సాయి పల్లవి Photo: Instagram.com/saipallavi.senthamarai/
news18-telugu
Updated: July 18, 2019, 12:00 PM IST
సాయి పల్లవి.. 'ఫిదా' సినిమాతో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న అందాల నటి. తమిళ భామ అయిన.. 'ఫిదా' సినిమాలో చక్కగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. తన డైలాగ్ డెలివరితో అందమైన నటనతో అందర్ని కట్టిపడేసింది. సాయి పల్లవి చేసిన సినిమాలు కొన్నే అయిన.. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. హావ భావాలను చక్కగా ప్రదర్శించగల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ భామ క్రేజ్‌ను చూసిన ‘డియర్‌ కామ్రేడ్’ దర్శక నిర్మాతలు మొదట సాయి పల్లవినే విజయ్ సరసన హీరోయిన్‌గా తీసుకొవాలని అనుకున్నారట. అందులో భాగంగా సాయిపల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో లిప్‌లాక్‌ సీన్లు ఉండటంతో సాయి పల్లవి 'డియర్ కామ్రెడ్'లో నటించేందుకు ఒప్పుకోలేదట. ముద్దు సీన్లలో తనకు నటించడం  అసౌకర్యంగా ఉంటుందని.. అందుచేత విజయ్‌తో ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదని సమాచారం. దీంతో అప్పటికే 'గీత గోవిందం' తో సూపర్ హిట్ వచ్చిన రష్మికను తీసుకున్నారట చిత్ర బృందం. అయితే ఈ ప్రచారంపై హీరోయిన్ సాయిపల్లవి, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్ర బృందం స్పందించాల్సీ వుంది.  కాగా  ఇటీవలే విడుదలైన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా ట్రైలర్‌‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను ఈ నెల 26న విడుదల చేయనున్నారు. 
Loading...

View this post on Instagram
 

♥️


A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on

అది అలా వుంటే సాయి పల్లవి తెలుగులో వేణు ఊడుగుల (నీది నాది ఒకేకథ ఫేమ్‌) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. రానా హీరోగా తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా సాగనున్ననది. ఈ చిత్రంలో రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నట్లు టాక్. ఈ మూవీలో సాయి పల్లవి మేకప్ లేకుండా నక్స లైట్ పాత్రలో నటించనున్నట్లు సమచారం. గుండెల్నీ పిండిసే సన్నివేశాలతో అల్లుకున్న ఈ కథలో.. సాయి పల్లవి, రానా క్యారెక్టర్స్‌ను మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించనున్నారు. దీనికి తోడు సాయి పల్లవి  ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల, నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న మరో సినిమాలో కూడ నటిస్తోంది.
First published: July 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...