జబర్ధస్త్ నుంచి రోజా ఔట్.. కేసీఆర్ కారణమా..

ఇప్పటి వరకు జబర్ధస్త్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజా త్వరలోనే ఈ షోకు గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం. రోజా జబర్ధస్త్ షో నుంచి తప్పుకోవడం వెనక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 15, 2019, 1:28 PM IST
జబర్ధస్త్ నుంచి రోజా ఔట్.. కేసీఆర్ కారణమా..
సీఎం కేసీఆర్, రోజా (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్‌సీపీ బంపర్ మెజారిటీతో అధికారంలో వచ్చింది. ఇక వైసీపీ తరుపున రెండోసారి ‘నగరి’ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు జగన్ క్యాబినేట్‌లో మంత్రి పదవి ఖాయమనే మాట వినబడింది. సామాజిక సమీకణాల నేపథ్యంలో రోజాకు క్యాబినేట్‌లో స్థానం దక్కలేదు. దీంతో రోజాకు జగన్మోహన్ రెడ్డి క్యాబినేట్ హోదా గల ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఏపీఐఐసీ చైర్మన్ పదవి దక్కినప్పటికీ రోజా ..జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది వరకటిలా జబర్ధస్త్‌ షోలో యాంకర్స్‌తో కలిసి డాన్సులు గట్రా చేయకుండా చాలా  హుందాగా వ్యవహరిస్తున్నారు. ఐతే.. ఏపీలో మరో రెండున్నరేళ్ల తర్వాత జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో రోజాకు మంత్రి పదవి దక్కడం పక్కా అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఈ నేపథ్యంలో రోజా తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాలనుకున్నట్టు సమాచారం. దీంతో ఇప్పటి వరకు జబర్ధస్త్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజా త్వరలోనే ఈ షోకు గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం. రోజా జబర్ధస్త్ షో నుంచి తప్పుకోవడం వెనక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.రీసెంట్‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడులోని అత్తి వరదరాజ స్వామి దర్శనానికి వెళుతూ రోజా ఇంట్లో బస చేసారు. దర్శనానంతరం రోజా.. ఇంట్లో విందు ఆరగించారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరి మధ్య రాజకీయ సంబంధమైన విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగా కేసీఆర్..రోజాను ఉద్దేశిస్తూ.. పాలిటిల్స్‌లో చాలా సీరియస్‌గా ఉన్న రోజా.. జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా వ్యవహరించడం సమంజసంగా లేదు అంటూ సున్నితంగా వారించినట్టు చెబుతున్నారు. అలా అని ఆ ప్రోగ్రామ్‌ను తప్పుపట్టలేదు కేసీఆర్. ఇప్పటి వరకు ఎలా ఉన్న పర్వాలేదు. ఇకముందు జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్స్‌కు పులిస్టాప్ పెట్టి.. రోజా తన దృష్టిని పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెడితేనే భవిష్యత్తులో రాజకీయంగా మరింత పైకి రావచ్చని  కేసీఆర్..రోజాకు సలహా ఇచ్చినట్టు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్‌ రోజాను తన కూతురు అని సంభోదించడం గమనార్హం. మరోవైపు జబర్ధస్త్‌కు గుడ్ బై చెప్పాలా..వద్దా అనే ఆలోచనలో ఉన్న రోజాకు తండ్రి స్థానంలో కేసీఆర్ చెప్పిన మాటలతో ఇక ఈ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే రోజా.. జబర్ధస్త్ ప్రోగ్రామ్‌ నిర్వాహకులతో మరో ఆరు నెలల వరకు అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ వరకు రోజా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌ను జడ్జ్‌గా వ్యవహరించి.. ఆ తర్వాత తన దృష్టిని పూర్తి స్థాయి రాజకీయాలపై కేటాయించనున్నట్టు సమాచారం.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>