హోమ్ /వార్తలు /సినిమా /

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పెంపుడు కుక్క చనిపోయిందా..?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పెంపుడు కుక్క చనిపోయిందా..?

ఇలా గొంతు నులిమి చంపితేనే మృతుడి మెడపై వృత్తాకారంలో గుర్తులు వస్తాయని.. ఇప్పుడు సుశాంత్ మెడపై అలాంటి గుర్తులే ఉన్నాయని తెలిపాడు అంకిత్ ఆచార్య. ఏదేమైనా కూడా సుశాంత్ కేసులో ఒక్కోరోజు ఒక్కో ట్విస్ట్ వస్తుంది. మరోవైపు సిబిఐకి వెళ్లిన తర్వాత రియా చుట్టూ ఈ ఉచ్చు బిగుస్తుంది.

Sushant Singh Rajput: ఇప్పుడు ఇదే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత అతడి పెంపుడు కుక్క ఫుడ్జ్ పరిస్థితి చూసిన వాళ్లంతా కన్నీరు పెట్టుకున్నారు.

ఇప్పుడు ఇదే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత అతడి పెంపుడు కుక్క ఫుడ్జ్ పరిస్థితి చూసిన వాళ్లంతా కన్నీరు పెట్టుకున్నారు. యజమాని కోసం అది పడిన బాధ చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు. మనుషుల కంటే కూడా జంతువులు ఎక్కువ ప్రేమ చూపిస్తుంటాయి. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. కల్మషం లేని వాటి ప్రేమ ముందు ఎవరి ప్రేమైనా కూడా తక్కువే. ముఖ్యంగా కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమను ప్రాణంగా చూసే యజమానులు చనిపోయినపుడు అవి కూడా అలాగే ప్రాణాలు విడిచేస్తుంటాయి.

కన్నీరు పెట్టిస్తున్న సుశాంత్ పెంపుడు కుక్క (sushant singh rajput pet dog)
కన్నీరు పెట్టిస్తున్న సుశాంత్ పెంపుడు కుక్క (sushant singh rajput pet dog)

ఇప్పుడు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆయన ఆత్మహత్య తర్వాత ఫుడ్జ్ మామూలు పరిస్థితికి రాలేకపోయింది. దాన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు సుశాంత్. రూమ్‌లో ఉన్నపుడు అదే అతడి ప్రపంచం కూడా. దాన్ని ఆడిస్తూ.. ఆడుకుంటూ ఉండేవాడు. అయితే సుశాంత్ మరణం తర్వాత ఆ పెంపుడు కుక్క కూడా వారం రోజులుగా తిండి మానేసి నీరసించిపోయిందని.. ఇప్పుడు అది చనిపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఫోన్ స్క్రీన్‌పై సుశాంత్ బొమ్మను పెట్టుకుని అలాగే చూస్తుండిపోయిన ఫుడ్జ్ వీడియోలు ఇప్పటికే అందరికీ కన్నీరు తెప్పిస్తున్నాయి.

కన్నీరు పెట్టిస్తున్న సుశాంత్ పెంపుడు కుక్క (sushant singh rajput pet dog)
కన్నీరు పెట్టిస్తున్న సుశాంత్ పెంపుడు కుక్క (sushant singh rajput pet dog)

సుశాంత్ చనిపోయిన రోజు నుంచి కూడా ఎంత ప్రయత్నించినా కూడా కనీసం అది తిండి తినడం లేదని.. నీళ్లు కూడా తాగకుండా యజమాని కోసం వేచి చూస్తుందని చెప్తున్నారు వాళ్లు. ఫుడ్జ్‌‌ను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పశు వైద్యున్ని సంప్రదించినా కూడా అది అలాగే ఉండిపోతుందని తెలుస్తుంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రోజు ఫుడ్జ్ మరో గదిలో ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పుడు సుశాంత్ లేడనే బెంగతోనే ఈ పెంపుడు కుక్క కూడా మరణించిందని ప్రచారం జరుగుతుంది. అయితే సుశాంత్ సన్నిహితులు మాత్రం అందులో ఎలాంటి నిజం లేదని.. దాన్ని మామూలు స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

First published:

Tags: Bollywood, Hindi Cinema, Sushanth singh Rajputh

ఉత్తమ కథలు