ప్రస్తుతం మహేష్ బాబు..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 15 వరకు కంప్లీట్ అవుతుందని ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన ఈసినిమాను మే 9న రిలీజ్ చేస్తున్నట్టు ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమాలో మహేష్ ..త్రీ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాను దిల్ రాజుతో పాటు సి.అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. మరోవైపు అల్లరి నరేష్..ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ పాత్రలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ మంచి రేటుకే అమ్ముడుపోయింది. హీరోగా మహేశ్‌కు ఇది 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. లాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయే ఈ సినిమాలో మహేష్ బాబు.. కొడుకు గౌతమ్ కృష్ణ ఒక ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనొక్కడినే’ సినిమాలో గౌతమ్ కృష్ణ నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు.
మరి గౌతమ్ కృష్ణ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అనే విషయమై క్లారిటీ రావాలంటే ఈ సినిమా నిర్మాతల నుండి అఫీషియల్ ప్రకటన వెలుబడే వరకు వెయిట్ చేయాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aswani Dutt, Dil raju, Mahesh babu, Pooja Hegde, PVP, Telugu Cinema, Tollywood, Vamsi paidipally