IS SRIHAN BEHIND THE DEEPTI SUNAINA SHANMUKH JASWANT BREAKUP WHAT ACTUALLY HAPPENED MK
Deepti Sunaina Shanmukh Jaswant breakup: దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ వెనుక శ్రీహాన్ ఉన్నాడా...అసలు ఆ రాత్రి ఏం జరిగింది...
ప్రతీకాత్మకచిత్రం
రాహుల్ మధ్య నడిచిన రొమాన్స్ వల్లనే రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడని అనుకున్న షణ్ముఖ్ పప్పులో కాలేశాడు. ఆల్రెడీ తాను బయట దీప్తితో డేటింగ్ చేస్తూనే, ఎంగేజ్ మెంట్ అయి హౌస్ లోకి అడుగుపెట్టిన సిరితో రొమాన్స్ చేశాడు. అది కాస్త బెడిసి కొట్టింది.
Deepti Sunaina Shanmukh Jaswant breakup: ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైన బ్రేకప్ ఇష్యూ ప్రస్తుతం టాలివుడ్ లో బర్నింగ్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 5కు వెళ్లే ముందు షణ్ముఖ్ తన గుండెల్లో ఉన్నది దీప్తి సునైన మాత్రమే అని తేల్చి చెప్పేశాడు. అంతేకాదు దీప్తి సునైన సైతం షన్ను బర్త్ డే సందర్భంగా బిగ్ బాస్ హౌస్ బయట షన్నుకు కు వినిపించేలా.. కనిపించేలా..సంబరాలు చేసింది. అన్నపూర్ణ ఏడెకరాల వెనుక దీప్తి నిలబడి షన్నుకు హ్యాపీ బర్త్ డే అని వినిపించేలా ఏర్పాట్లు చేసింది. అంతే కాదు ఫైర్ క్రాకర్స్ కాల్చి షన్నుపై తనకు ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలిపింది. అయితే షన్ను మాత్రం తన గేమ్ ప్లాన్ లో భాగంగా హౌస్ లోని సిరితో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగాడు. హగ్గులు, ముద్దులు, టచ్చింగులతో ఎంజాయ్ చేసి, ప్రేక్షకుల్లో తమ ఇద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్ ఉందని, గతంలో పున్ను, రాహుల్ మధ్య నడిచిన రొమాన్స్ వల్లనే రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడని అనుకున్న షణ్ముఖ్ పప్పులో కాలేశాడు. ఆల్రెడీ తాను బయట దీప్తితో డేటింగ్ చేస్తూనే, ఎంగేజ్ మెంట్ అయి హౌస్ లోకి అడుగుపెట్టిన సిరితో రొమాన్స్ చేశాడు. అది కాస్త బెడిసి కొట్టింది. ఇద్దరి కాంబినేషన్ బిర్యానీలో బాస్మతీ రైస్ లా కలిసి పోతుందని అంచనా వేస్తే, అది కాస్తా పులిహార అయిపోయింది. చివరకు ప్రేక్షకులకు కూడా షన్నుపై తమ వ్యతిరేకతను వెల్లిబుచ్చి, ఓట్ల రూపంలో సన్నీని గెలిపించారు.
ఇదంతా బాగానే ఉంది. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీప్తి, షణ్ముక్ జస్వంత్ సైతం బ్రేకప్ చెప్పుకునే స్థాయికి గొడవులు వెళ్లిపోయాయి. అయితే అటు సిరి, శ్రీహాన్ మాత్రం హౌస్ లో జరిగిందంతా లైట్ తీసుకున్నారు. అంతేకాదు ఇద్దరూ కలిసి ఎప్పటి లాగే కలిసిపోయారు. అయితే దీప్తి, షన్నులే ఇలా ఎందుకు విడిపోయారనేది ప్రశ్నగా మారిపోయింది. దీనికి మాత్రం ఎలాంటి సమాధానం దక్కడం లేదు. అయితే దీప్తి చెప్పుడు మాటలు వినడం వల్లనే ఇలా జరిగిపోయిందని ఆమె సన్నిహితులు అంటున్నారు. నిజానికి దీప్తి, షన్నులు గతంలో కూడా బ్రేకప్ అవడం మాత్రమే కాదు..మళ్లీ కలిసిపోయారు. అయితే ఈ సారి మాత్రం ఇద్దర మధ్య గొడవ పెద్దది అయ్యిందనే వాదన వినిపిస్తోంది. అయితే సిరి ఎక్కడ షన్నుతో కలిసిపోతుందో అనే ఓవర్ ప్రొటెక్టివ్ నెస్ కారణంగా, షన్ను గురించి దీప్తికి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇఛ్చాడని, టాక్ వినిపిస్తోంది. దీప్తీ కనుక షన్నును కంట్రోల్ లో పెడితే తనకు సిరి దగ్గరవుతుందని శ్రీహాన్ ప్లాన్ చేశాడు. కానీ అది కాస్త ముదిరి దీప్తి, షన్ను బ్రేకప్ కు దారి తీసింది. ఈ ఆటలో చివరకు సిరి, శ్రీహాన్ బాగానే ఉన్నారు. కానీ షన్ను మాత్రం ఆటలో అరటి పండయ్యాడు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.