నాగబాబుకు శివాజీరాజా ఇచ్చిన జబర్దస్త్ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా..

నాగబాబు నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలలో పరాజయం పాలయ్యారు. మొదట గెలుపుపై చాల ధీమాగా కనిపించినా.. ఫలితం మాత్రం ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది. అయితే నాగబాబు ఓటమి వెనుక ఓ ఆసక్తి గల కారణం ఉందని అంటున్నారు..కొందరు రాజకీయ విశ్లేషకులు.

news18-telugu
Updated: May 24, 2019, 4:39 PM IST
నాగబాబుకు శివాజీరాజా ఇచ్చిన జబర్దస్త్ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా..
శివాజీరాజా, నాగబాబు
  • Share this:
మెగాబ్రదర్ నాగబాబు నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలలో పరాజయం పాలయ్యారు. మొదట తన గెలుపుపై చాల ధీమాగా కనిపించినా.. ఫలితం మాత్రం ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది. గెలుపోటములు చాలా కామన్ అని అనుకున్నా నాగబాబు ఓటమి వెనుక ఒక ఆసక్తి గల కారణం ఉందని అంటున్నారు.. కొందరు రాజకీయ విశ్లేషకులు. ఆ కారణం ఏమిటంటే .. మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)  ఎన్నికల సమయంలో రాజశేఖర్, జీవిత దంపతులకు ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేశ్‌కు సపోర్ట్ చేసారు నాగబాబు. అంతేకాదు శివాజీరాజాపై పలు విమర్శలు చేసి ఆయన తీరును ఎండగట్టారు నాగబాబు. ఆ సమయంలోనే శివాజీరాజా కూడా నాగబాబుకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కొద్దికాలం క్రితం శివాజీ రాజా కూడా నరసాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, ఆ సమయంలో శివాజీరాజా నాగబాబుపై విమర్శనాస్త్రాలు కురిపించారు. పైసా ఖర్చు పెట్టని నాగబాబు మా సంఘం అభివృద్ధిని రెండేళ్ళు వెనక్కు తీసుకెళ్ళిన మనిషి అని.. ఇంత పెద్ద ఊరికి ఏదో చేస్తాడని ఎలా నమ్ముతారని కాస్త గట్టిగానే ఆయనకు వ్యతిరేకంగా స్వరం వినిపించాడు.

శివాజీరాజా, నాగబాబు


నరసాపురం శివాజీ స్వస్థలం కావడంతో ప్రజలు శివాజీ వైపే మొగ్గుచూపారు అందుకే శివాజీ రాజా మాటలు నమ్మిన ఓటర్లు నాగబాబుకు ఓటు వెయ్యలేదు అంటూ నాగబాబు ఓటమికి ఆసక్తిగల కారణాన్ని అన్వేషించారు రాజకీయ విశ్లేషకులు. నిజంగా శివాజీరాజాకు ఓటర్లను ప్రభావితం చేసే సీన్ ఉందో లేదో కాని ఇప్పుడీ చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. దీన్నే కొందరు నాగబాబుకు శివాజీరాజా ఇచ్చిన 'జబర్దస్త్' రిటర్న్ గిఫ్ట్ అని చమత్కరిస్తున్నారు.

First published: May 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు