సమంత, నాగ చైతన్య జంటకు కరోనా సోకిందా.. ఇదిగో క్లారిటీ..

Samantha Naga Chaitanya: మెల్లగా టాలీవుడ్‌లో కూడా కరోనా కలకలం మొదలైంది. మొన్నటికి మొన్న నిర్మాత బండ్ల గణేష్‌కు పాజిటివ్ వచ్చిన తర్వాత చాలా మంది అలర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన ఉన్న కాలనీలోనే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2020, 2:20 PM IST
సమంత, నాగ చైతన్య జంటకు కరోనా సోకిందా.. ఇదిగో క్లారిటీ..
సమంత నాగ చైతన్య (samantha naga chaitanya)
  • Share this:
మెల్లగా టాలీవుడ్‌లో కూడా కరోనా కలకలం మొదలైంది. మొన్నటికి మొన్న నిర్మాత బండ్ల గణేష్‌కు పాజిటివ్ వచ్చిన తర్వాత చాలా మంది అలర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన ఉన్న కాలనీలోనే ఉండే ఓ కుర్ర హీరో తన కుటుంబంతో సహా గెస్ట్ హౌజ్‌కు వెళ్లిపోయాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత, నాగ చైతన్య జంటకు కూడా కరోనా వైరస్ సోకిందంటూ వార్తలు వస్తున్నాయి. అవి రావడానికి ప్రధాన కారణం శిల్పా రెడ్డి.. ఈమె సమంతకు స్నేహితురాలు. మూడు నాలుగు రోజుల కింద ఈమెను కలిసింది కూడా. ముద్దు కూడా పెట్టింది.. ఆ తర్వాత శిల్పా రెడ్డికి కరోనా అని తేలింది.
పెంపుడు కుక్కతో సమంత నాగ చైతన్య (samantha naga chaitanya dog/Instagram)
పెంపుడు కుక్కతో సమంత నాగ చైతన్య (samantha naga chaitanya dog/Instagram)


దాంతో సమంతకు కూడా కరోనా వచ్చిందంటూ ప్రచారం మొదలైంది. సమంత నుంచి చైతూకు కూడా కరోనా వైరస్ సోకిందని వార్తలొస్తున్నాయి. దాంతో అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. కానీ అందులో నిజం లేదని ఇప్పుడు తెలుస్తుంది. ఈ ఇద్దరికి టెస్టులు చేయించుకున్న తర్వాత కరోనా సోకలేదని వార్తలొస్తున్నాయి. నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీంతో అక్కినేని అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో ఓ సీనియర్ నటి కుమారుడితో పాటు నిర్మాత బండ్ల గణేష్, ఈ మధ్యే సీరియల్ నటుడు ప్రభాకర్ కూడా కరోనా బారిన పడ్డారు. దాంతో అంతా బాగా అలర్ట్ అయ్యారు.

First published: June 25, 2020, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading