హోమ్ /వార్తలు /సినిమా /

Samantha: సమంత దగ్గర అంత కాస్ట్లీ కారు ఉందా? ఆసక్తిరేపుతున్న వీడియో

Samantha: సమంత దగ్గర అంత కాస్ట్లీ కారు ఉందా? ఆసక్తిరేపుతున్న వీడియో

సమంత

సమంత

సమంత కారు దిగి ఎయిర్ పోర్టులోకు వెళ్తున్న వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో హల్ చల్ చేస్తుంది. అయితే ఈ వీడియోలో సమంత దిగిన కారు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సమంత(Samantha).. తగ్గేదేలే అంటూ.. దూసుకెళ్తుంది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటు తెలుగు... అటు తమిళ్ సినిమాలతో పాటు..బాలీవుడ్‌లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా మారింది. అటు సోషల్ మీడియాలో(Social Media) కూడా సమంత ఏమాత్రం తగ్గడం లేదు. అభిమానులకు రోజూ ఏదో అప్ డేట్ ఇస్తూ ఉంది. హాట్ ఫోటోలతో నెట్టింట్లో మంటలు పెట్టేసింది. సమంత షేర్ చేసిన ఫోటోలు చూసి జనాలు ఫిదా అవుతున్నారు. ఇక సమంత అందాల ఆరబోతను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సమంత డ్రెస్సింగ్ మీద జరిగే ట్రోలింగ్ మామూలుగా ఉండదు. డ్రెస్సింగ్ సెన్స్ మీద వచ్చిన ట్రోలింగ్‌లపై సమంత ఏ రేంజ్‌లో మండిపడిందో అందరికీ తెలిసిందే.

నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత ఏం చేసిన అది హట్ టాపిక్‌గా మారుతోంది. ఏ సినిమా చేసినా.. ఏ హీరోతో కలిసి నటించిన అది వైరల్ అవుతోంది. అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఎయిర్ పోర్టులో సమంత కారు దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఇప్పుడు ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. సమంత ఏ కారులో వచ్చింది? ఆకారు ఏంటి ? ఆమె దగ్గర ఆ కారు ఉందా ? ఎప్పుడు కొనింది అంటూ రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కొందరు సమంత దిగిన కారు రోల్స్ రాయ్స్ (Rolls Royce) అని.. అంటున్నారు. అయితే మరో నెటిజన్ సమంత రోల్స్ రాయ్స్ ఎప్పుడు కొనిందా అంటూ ప్రశ్నించారు. మరో నెటిజన్ సమంత దగ్గర రోల్స్ రాయల్స్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నాడు. మరో నెటిజన్ సమంత స్టైల్ చూసి దీపికాను కాపీ చేస్తుందటూ విమర్శించాడు. మరికొందరు మాత్రం సమంత లుక్ స్టన్నింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి సమంత దగ్గర రోల్స్ రాయ్స్ కారు ఉందో లేదో మరి ఆమెనే దీనిపై క్లారిటీ ఇవ్వాలి. రోల్స్ రాయ్స్ కారు చాలా కాస్ట్లీ దీని ధర.. ఏడు కోట్లకు పైగానే. మరి అలాంటి కారును సమంత మెంటైన్ చేస్తుందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.


సమంత ప్రస్తుతం యశోద షూటింగ్‌లో బిజీగా ఉంది. శాకుంతలం సినిమా షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి సమంత ఖుషీ సినిమా కూడా చేస్తుంది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్‌లో ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే..

First published:

Tags: Samantha akkineni, Samantha Ruth Prabhu

ఉత్తమ కథలు