సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఈయన చనిపోయి 20 రోజులు కావొస్తున్నా కూడా ఇప్పటికీ సుశాంత్ ఆత్మహత్య గురించి రోజుకో వార్త బయటికి వస్తూనే ఉంది. ఈ కేసులో ఆయన గాళ్ ప్రెండ్ రియా చక్రవర్తి కూడా కీలకంగా మారింది. సుశాంత్ చనిపోయే కొన్ని రోజుల ముందు వరకు ఆయనతోనే కలిసి సహజీవనం చేసింది రియా. ఇద్దరూ కలిసి మూడు నెలలకు పైగానే ఒకే ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు ఈయన ఎలా ఉండేవాడు అనే విషయంపై కూడా పోలీసులకు కొన్ని విషయాలు చెప్పింది రియా.
అసలు అసలైన విషయాలను మాత్రం రియా పోలీసుల ముందు చెప్పలేదని.. దాచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్ భట్‌తో రియా చక్రవర్తికి ఉన్నది ఎలాంటి బంధం అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సుశాంత్ కేసులో ఇప్పటికే 28 మంది నుంచి వాంగ్మూలం సేకరించారు పోలీసులు. ఆ తర్వాత కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే సుశాంత్ సూసైడ్ కేసులో రియా చక్రవర్తి కొన్ని కీలకమైన విషయాలను దాచేసింది.
రియా చక్రవర్తి సోదరుడు షోయిక్ చక్రవర్తిని అందుకే ముంబై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈయన సుశాంత్‌తో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి కృత్రిమ మేధస్సుకి సంబంధించిన సంస్థ `వివిడ్రేజ్ రియాలిటీక్స్` మొదలు పెట్టారు. ఇందులో రియా సోదరుడు పార్ట్‌నర్. 2019లో రియా స్వయంగా దీన్ని ప్రారంభించింది. కానీ ఈ సంస్థ గురించి కానీ.. లావాదేవీల గురించి కానీ పోలీసుల ముందు రియా చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తుంది. అందుకే రియా సోదరుడిని కూడా పోలీసులు పిలిచారు.
ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇంత పెద్ద విషయం పోలీసుల ముందు రియా ఎందుకు దాచేసింది.. 11 గంటల విచారణలో ఇదెందుకు బయటికి రాలేదనేది ఆసక్తితో పాటు అనుమానాలు కూడా పెంచేస్తుంది. సుశాంత్ విషయంలో అసలేం జరిగిందో తమకు తెలియాలంటూ అభిమానులు కూడా మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Hindi Cinema, Rhea Chakraborty, Sushanth singh Rajputh