కొన్నాళ్లుగా మీటూ ఉద్యమంపై ఎక్కడా ఎలాంటి వార్తలు వినిపించడం లేదు. ఆ మధ్య హిందీ ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీలను మీటూ ఎఫెక్ట్ ఊపేసింది. కొన్ని రోజుల నుంచి ఇది తగ్గిపోయే సరికి మోహన్ లాల్ అన్నట్లు ఇది కొన్ని రోజుల ముచ్చటే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సంచలన దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపైనే లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. బాలీవుడ్‌లో సంచలన సినిమాలు తెరకెక్కించిన హిరాణీపై ఇప్పుడు అడి అసిస్టెంట్ డైరెక్టర్ ఆరోపణలు చేసింది.
సంజయ్ దత్ బయోపిక్ సంజు సినిమాకు అసిస్టెంటుగా పని చేసిన లేడీ డైరెక్టర్‌పై పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో హిరాణీ లైంగికంగా వేధించాడే ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ విషయంపై రాజ్ కుమార్ హిరాణీ స్నేహితుడు.. నిర్మాత అయిన విధువినోద్ చోప్రాకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఆరోపణలు బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.
రాజ్ కుమార్ హిరాణీ వేధింపులపై ఏకంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఓ లేఖ రాసింది. హిరాణీ దేశంలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు.. ఆయన వద్ద పని చేయడం అంటే గొప్పగా భావించానని.. కానీ అదే తాను చేసిన పెద్ద తప్పు అంటూ రాసుకొచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్. తనపై హిరాణీ చేసిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేక నరకయాతన అనుభవించానంటుంది ఆమె.
ఆర్నెళ్ల పాటు తనను లైంగికంగా వేధించాడని.. తన వల్ల శరీరం, మనసు పాడైపోయానని చెప్పుకొచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్. ఇది బయటపెడితే ఎక్కడ తన ఉద్యోగానికి ముప్పొస్తుందో అని చెప్పలేదంటుంది ఈ లేడీ డైరెక్టర్. మొత్తానికి ఇప్పటికే బాలీవుడ్‌లో సుభాష్ ఘాయ్ లాంటి లెజెండరీ దర్శకులు కూడా ఇందులో ఇరుక్కున్నారు. ఇప్పుడు రాజ్ కుమార్ హిరాణీపై రేగిన ఈ రచ్చ ఎంతదూరం వెళ్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: #MeToo movement, Raj kumar hirani, Telugu Cinema, Tollywood