పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఎంతమంచి స్నేహితులు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం హీరో, దర్శకుడు రిలేషన్ మాత్రమే కాదు వీళ్లది.. అంతకుమించి. పవన్‌ను స్నేహితుడిగా కంటే కూడా అంతకంటే మించి చూస్తుంటాడు మాటల మాంత్రికుడు. తనకు చాలా విషయాల్లో పవన్ అంటే చెరిగిపోని అభిమానం ఉందని చెప్తుంటాడు త్రివిక్రమ్. మరోవైపు ఈ దర్శకుడిపై అంతే ప్రేమ చూపిస్తుంటాడు పవన్ కళ్యాణ్ కూడా. అయితే ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు మనస్పర్థలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత పవన్, త్రివిక్రమ్ విడిపోయారంటూ వార్తలు వచ్చాయి కానీ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రానా త్రివిక్రమ్‌ను దూరం పెడతాడని ఫ్యాన్స్ మాత్రమే కాదు ఎవరూ అనుకోరు. ఎందుకంటే పవన్, త్రివిక్రమ్ మధ్య సినిమాలను మించిన బంధం ఎప్పుడో ఏర్పడింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరి మధ్య ఓ సినిమా చిచ్చు పెట్టిందని ప్రచారం జరుగుతుంది. అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ కావడంతో ఆ లోటు భర్తీ చేయడానికి పవన్‌తో త్రివిక్రమ్ మరో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాడు. అయితే అది కుదరడం లేదు.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ (pawan kalyan trivikram)
పవన్ బిజీగా ఉండటంతో ఇప్పట్లో త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రావడం కూడా కష్టమే. అయితే తాజాగా ఓ విషయంలో మాత్రం త్రివిక్రమ్ తీరు పవన్‌ను బాగా హర్ట్ చేసిందని తెలుస్తుంది. దసరా సందర్భంగా పవన్ మరో సినిమా అనౌన్స్ చేసాడు. చిన్న దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు పవన్. ఇది మలయాళ సినిమా అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్.. ఇందులో బిజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు పవన్. అయితే ఈ సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కిస్తే బాగుంటుందని ముందు నుంచి కూడా పవన్ అనుకుంటున్నాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమాపై అంత ఆసక్తి చూపించలేదు.

పవన్ కళ్యాణ్ సాగర్ కే చంద్ర (pawan sagar k chandra)
కానీ ఈ సినిమా చేస్తే బాగుంటుందని పవన్‌కు చెప్పింది మాత్రం మాటల మాంత్రికుడే. కానీ దర్శకుడిగా మాత్రం ఉండనని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. దానికి కారణం అప్పటికే దర్శకుడు సాగర్ ఈ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేయడమే. దానికితోడు రీమేక్ సినిమాలు డైరెక్ట్ చేయడానికి త్రివిక్రమ్ ఇష్టపడలేదని.. అందుకే పవన్ ఇచ్చిన ఆఫర్‌కు నో చెప్పినట్లు తెలుస్తుంది. అలా త్రివిక్రమ్ తీరు పవన్ హర్ట్ అయ్యాడని ప్రచారం అయితే జరుగుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో మరో హీరో కూడా నటించబోతున్నాడు. అదెవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published:October 27, 2020, 07:27 IST